తెలుగు వెండితెరపై అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అచ్చతెలుగు అమ్మాయి శ్రీలీల. కెరీర్ స్టాటింగ్ లోనే అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ, తన ఎనర్జిటిక్ డ్యాన్సులతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తన కెరీర్‌లో ఒక కీలక మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు శ్రీలీల అంటే కేవలం గ్లామర్, డ్యాన్స్‌లకే పరిమితం అనే ముద్ర ఉండేది. కానీ, తాజాగా విడుదలైన ఆమె తమిళ చిత్రం ‘పరాశక్తి’ ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాతో కేవలం కమర్షియల్ హీరోయిన్‌గానే కాకుండా, నటనకు ఆస్కారమున్న పాత్రల్లోనూ తను రాణించగలనని నిరూపించుకుంది. అయితే
Also Read : Sudha Kongara : ఫేక్ ఐడీలు, నెగటివ్ రివ్యూలు.. విజయ్ ఫ్యాన్స్‌పై సుధా కొంగర ఫైర్!
తాజాగా జరిగిన ఒక వేడుకలో శ్రీలీల మాట్లాడుతూ.. ఈ గుర్తింపు పట్ల ఎంతో భావోద్వేగానికి గురైంది.. ‘ఎప్పుడూ నా పాటలు, డ్యాన్సుల గురించే మాట్లాడేవారు.. కానీ మొదటిసారి నా నటన గురించి గొప్పగా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. పరిశ్రమ నుంచి వస్తున్న ఈ ప్రశంసలే నాకు దక్కిన అసలైన విజయం’ అని చెప్పుకొచ్చింది. తమిళంలో విజయవంతంగా అడుగుపెట్టిన శ్రీలీల, త్వరలోనే హిందీ చిత్ర పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. నటిగా తనను తాను నిరూపించుకున్న ఈ సమయంలో, మరిన్ని పవర్ ఫుల్ పాత్రలు ఆమెను వరిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.
