టాలివుడ్ లో బిజీ హీరోయిన్ అంటే శ్రీలీల పేరు వినిపిస్తుంది. చూపు తిప్పుకొనివ్వని అందం.. నటన, డ్యాన్స్ తో కుర్రకారును తెగ ఆకట్టుకుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మొత్తం డజనుకు పైగా సినిమాలు చేతులో ఉన్నాయి.. అయితే ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. అదేంటంటే ఈ అమ్మడు కూడా సామ్ లాగా అరుదైన వ్యాధితో భాధపడుతుందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. మరి శ్రీలీల బాధపడుతున్న ఆ అరుదైన వ్యాధి ఏంటి..నిజంగానే అది ట్రీట్మెంట్ లేని వ్యాధా..పెళ్లి కూడా కష్టమేనా.. అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి..
పెళ్లి సందD సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది.. అప్పటినుండి ఈమె ఫేట్ మారిపోయింది. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకొని వరుసగా పది సినిమాలకు సైన్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఎంత మంది సీనియర్ హీరోయిన్లు ఉన్నా తగ్గేదేలే అన్నట్లు వరుస ఆఫర్స్ ను అందుకుంటూ బిజీ అయిపోతుంది.. ఇదిలా ఉండగా ఈ అమ్మడు గురించి ఓ వార్త వినిపిస్తుంది..శ్రీలీల ఒక్కసారి తుమ్మితే కంటిన్యూగా 20 నిమిషాల వరకు అలా తుమ్ముతూనే ఉంటుందట. ఇక కంటిన్యూగా అలా తుమ్మేసరికి చాలాసార్లు శ్రీలీల ఇబ్బంది పడి డాక్టర్లను కలిసినా కూడా ఫలితం లేకుండా పోయిందట. ఈ వ్యాధి కారణంగానే చాలా సార్లు కొన్ని సినిమా షూటింగ్ లకు డుమ్మా కొట్టింది..
ఇక ఈ విషయాన్ని ఓ సందర్బంలో ఈ అమ్మడే స్వయంగా చెప్పడంతో అందరు అదే నిజమని నమ్ముతున్నారు.. మరోసారి ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఈ విషయం తెలిసిన చాలామంది శ్రీలీలకు ఇలాంటి జబ్బు ఉంటే పెళ్లి అవ్వడం కూడా కష్టమే అంటూ కామెంట్లు పెడుతున్నారు… ఈ వార్త విన్న ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.. ఇకపోతే సినిమాల విషయానికొస్తే.. డజను సినిమాలను లైన్ లో పెట్టుకుంది.. ప్రస్తుతం బాలయ్య తో చేసిన సినిమా భగవంత్ కేసరి..ఈ సినిమా దసరా బరిలో దిగబోతుంది. అక్టోబర్ 19న ఈ మూవీ గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది..