Site icon NTV Telugu

Sree Vishnu: శ్రీవిష్ణు Vs శ్రీవిష్ణు.. బాక్సాఫీస్ వద్ద నాతో నాకే పోటీ అంటున్న యువ హీరో!

Sree Vishnu

Sree Vishnu

Sree Vishnu: టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న యువ హీరో శ్రీవిష్ణు. ప్రస్తుతం హీరో శ్రీవిష్ణు ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన నటించిన రెండు వేర్వేరు చిత్రాలు కేవలం 24 గంటల వ్యవధిలోనే థియేటర్‌లోకి రాబోతున్నాయి. ఫిబ్రవరి 27న శ్రీవిష్ణు హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ’ రిలీజ్ కానుండగా, ఆ తర్వాతి రోజే ఫిబ్రవరి 28న ఆయన హీరోగా తెరకెక్కిన ‘విష్ణు విన్యాసం’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

READ ALSO: Maha Shivaratri 2026: రేపే మహాశివరాత్రి.. ఈ తప్పులు చేస్తే పుణ్యం రాదు సరే కదా.. మహా పాపం!

నిజానికి ఏ హీరో అయినా తన చిత్రాల రిలీజ్‌లకు కొంత గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. కానీ హీరో శ్రీవిష్ణు దానికి భిన్నంగా ఒక్క రోజు వ్యవధిలో తన రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కారణం ఓటీటీ ఒప్పందాలే అని సమాచారం అంటున్నారు. ‘మృత్యుంజయ’ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా, ‘విష్ణు విన్యాసం’ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఆయా ప్లాట్‌ఫారమ్‌లు సూచించిన తేదీలకే సినిమాలను రిలీజ్ చేయాల్సి రావడంతో శ్రీవిష్ణు వర్సెస్ శ్రీవిష్ణు వార్‌ను ప్రేక్షకులు వెండి తెరపై చూడబోతున్నారు. తనదైన శైలి వినోదంతో ఒక సినిమా ద్వారా వస్తూ, మరొక వైపు సీరియస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ రెండు చిత్రాల్లో ఏదీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందో వేచి చూడాలి.

READ ALSO: India vs Pakistan Match: టీమిండియా ఓటమికి ‘‘ప్లాన్’’ చేసిన షాహిద్ అఫ్రిది..

Exit mobile version