NTV Telugu Site icon

Sree Vishnu New Movie: పండగ వేళ శ్రీవిష్ణు కొత్త సినిమా ఆరంభం!

Sree Vishnu New Movie Update: పండగ వచ్చిందంటే సినిమా అప్‌డేట్స్‌ ఎన్నో వస్తుంటాయి. ఉగాది పండగ సందర్భంగా కొత్త సినిమా కబుర్లతో సోషల్‌ మీడియా కళకళలాడుతోంది. ఉగాది పండగ వేళ మాస్‌మహారాజ రవితేజ కొత్త చిత్రాన్ని ప్రకటించగా.. నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’కు సంబందించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు తన కొత్త సినిమాను ఆరంభించారు. నూతన సంవత్సర శుభ సందర్భంగా ఈరోజు శ్రీవిష్ణు 19వ చిత్రం ఘనంగా ప్రారంభించబడింది.

శ్రీవిష్ణు 19వ చిత్రంకు నూతన దర్శకుడు జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహించనున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్, విజిల్ వర్తీ ఫిల్మ్స్, కేఎఫ్‌సీ బ్యానర్‌లపై అనూష ద్రోణవల్లి, సీతా కుమారి కోత మరియు గోపాలం లక్ష్మీ దీపక్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రొడక్షన్ నంబర్ 1పై దర్శకుడు బాబీ కొల్లి మరియు రచయిత కోన వెంకట్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఉగాది పండగ సందర్భంగా ఈరోజే ఉదయం నవీన్ యెర్నేని, నందిని రెడ్డి, కిషోర్ తిరుమల స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. నిర్మాత దిల్ రాజు క్లాప్‌ కొట్టగా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్‌కి దర్శకుడు వివి వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ వేడుకకు సాహు గరిపాటి, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, శరత్ మరార్, సితార నాగ వంశీ, బివిఎస్ రవి సహా మరికొంత మంది హాజరయ్యారు.

Also Read: Saripodhaa Sanivaaram: ఉగాది వేళ నాని ‘సరిపోదా శనివారం’ నుంచి కొత్త పోస్టర్!

శ్రీవిష్ణు 19వ చిత్రంకు భాను భోగవరపు కథను అందించగా.. నందు సవిరిగాన డైలాగ్స్ అందించాడు. విజయ్ బులగానిన్ సంగీతం అందించనుండగా.. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. సామజవరాగమనా, ఓం భీమ్ భీష్ సినిమాలతో శ్రీవిష్ణు ఇటీవల హిట్ కొట్టాడు. ఈ తాజాగా సినిమాతో హ్యాట్రిక్ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.