NTV Telugu Site icon

SRH vs LSG: రాణించిన బడోనీ, పూరన్.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ 166

Lsg

Lsg

ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 165 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. సన్రైజర్స్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఒకానొక సమయంలో 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లక్నో.. ఆ తర్వాత బరిలోకి వచ్చిన ఆయుష్ బడోని లక్నో జట్టుకు ఆయువు పోశాడు. అతనికి తోడు నికోలస్ పూరన్ కూడా రాణించాడు. దీంతో.. లక్నో ఎస్ఆర్హెచ్ ముందు ఫైటింగ్ టార్గెట్ను పెట్టింది.

Megastar New Record: ఇది కదా మెగాస్టార్ అంటే.. ఆ మాత్రం ఉండాలి!

లక్నో బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ (29), క్వింటాన్ డికాక్ (2), మార్కస్ స్టోయినీస్ (3), కృనాల్ పాండ్యా (24), నికోలస్ పూరన్ (48*), ఆయుష్ బడోనీ (55*) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టగా.. ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ తీశారు. అయితే.. నిన్న హైదరాబాద్ లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దైంది. ఈ క్రమంలో.. బంతి స్వింగ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే లక్నో బ్యాటర్లు మొదట వికెట్లు త్వరగా కోల్పోయారు. ఆ తర్వాత బడోని, పూరన్ నిలకడగా ఆడి స్కోరును పెంచారు. మరి ఇప్పుడు సన్ రైజర్స్ బ్యాటర్లు లక్నో బౌలర్లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

PM Modi Road Show In Vijayawada: బెజవాడలో ప్రధాని మోడీ రోడ్‌షో.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో ప్రత్యేక భేటీ..