NTV Telugu Site icon

SPY Movie OTT: నెల తిరగకుండానే.. ఓటీటీలోకి వచ్చేసిన ‘స్పై’ మూవీ! స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?

Spy Movie Ott

Spy Movie Ott

Nikhil SPY Movie Streaming on Amazon Prime Video From July 27: టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాగా.. రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్, సాన్య ఠాకూర్ కథానాయికలు కాగా.. మకరంద్ దేశ్ పాండే, అభినవ్ గోమఠం ముఖ్యమైన పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య జూన్‌ 29న థియేటర్లలో స్పై సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా రూపొందిన స్పై సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అనుకోలేక పోయింది. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు ఈ సినిమా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ వేదికగా గురువారం (జులై 27) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మరియు హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో చూడని ఫాన్స్ ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు.

జై వర్ధన్ (నిఖిల్) రా ఏజెంట్. శ్రీలంకలో అతడు పనిచేస్తుంటాడు. భారతదేశంపై దాడి ప్రయత్నాల్లో ఉన్న ఉగ్రవాది ఖదీర్ ఖాన్ చనిపోయాడని భావిస్తారంతా. అయితే ఖదీర్ ఖాన్ నుంచి నష్టం కొనసాగుతూనే ఉంటుంది. చనిపోయాడనుకున్న ఖదీర్ కోసం జై రంగంలోకి దిగుతాడు. మరి ఖదీర్ దొరికాడా? లేదా?.. జై తన అన్న సుభాష్ (ఆర్యన్ రాజేశ్)ని చంపిన వాళ్లని ఎలా కనుక్కున్నాడు?, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ అదృశ్యం వెనకున్న రహస్యానికీ సంబంధం ఏంటి? అనేదే ఈ సినిమా కథ.

Also Read: WI vs IND 1st ODI: నేడు భారత్, విండీస్‌ తొలి వన్డే.. అందరిచూపు అతడిపైనే!

Also Read: Gold Today Price: బంగారం ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు!

Show comments