India vs New Zealand 4th T20: విశాఖపట్నంలో భారత్, న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 స్టార్ట్ కానుంది. ఇప్పటికే ఈ టీ20 సిరీస్‌ను టీమిండియా గెలుచుకుంది. నాలుగో టీ20 మ్యాచ్‌లో భాగంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ఇషాన్ కిషన్ దూరమయ్యాడు. ఇషాన్ ప్లేస్‌లో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఇషాన్ కిషన్ గైర్హాజరీకి కారణాలను వెల్లడించాడు.
READ ALSO: Amazon Layoffs: 16,000 మంది ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్.. వీరి స్థానంలో AI..
మూడో టీ20లో ఇషాన్ కిషన్ గాయపడ్డాడని, దీంతో నాలుగవ టీ20 నుంచి తప్పుకున్నాడని చెప్పాడు. నిజానికి ఈ సిరీస్‌లో ఇషాన్ కిషన్‌కు శుభారంభం దక్కలేదు. కానీ ఇషాన్ కిషన్ తన పవర్ హిట్టింగ్ బ్యాటింగ్‌తో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. ఈ సిరిస్ ఫస్ట్ మ్యాచ్‌లో 8 పరుగులు, ఆ తర్వాత రాయపూర్‌లో 76, గౌహతిలో 28 పరుగులు చేశాడు.
భారత్ ప్లేయింగ్ XI
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్ ప్లేయింగ్ XI
టిమ్ సీఫెర్ట్, డెవాన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, జాక్ ఫాల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ.
READ ALSO: Silver Prices: తెల్లబంగారమా? వెండి గండమా? మూడు రోజుల్లో రూ.48 వేలు పెరిగిన వెండి..