NTV Telugu Site icon

Beer Bottle : సీల్డ్ బీరు సీసాలో ప్లాస్టిక్ స్పూన్.. ఎక్కడంటే..

Beer

Beer

Spoon in Beer Bottle : ఈ మధ్యకాలంలో తినే ఆహారంలో తినాల్సిన వాటికంటే తినరాని వస్తువులు లేదా ఇతర జంతువులు ప్రత్యక్షమవుతున్నాయి. వీటికి సంబంధించి అధికారులు ఆయా విక్రయ దారులపై చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి సంఘటననే తాజాగా సీల్డ్ బీర్ బాటిల్ లో ఓ ప్లాస్టిక్ స్పూన్ ప్రత్యక్షమైంది. ఈ సంఘటన నంద్యాల జిల్లా డోన్ నగరంలో చోటుచేసుకుంది. డోన్ పట్టణంలోని బేతంచెర్ల సర్కిల్ వద్ద ఉన్న వైన్ షాపులో యువకుడు బీర్ సీసా కొనుగోలు చేశాడు. ఆ బీర్ బాటిల్ తీసుకున్న యువకుడు లోపల ఏదో ఉందని గమనించాడు. అయితే అదేంటో అతనికి అర్థం కాకపోవడంతో.. సెల్ఫోన్ కు ఉన్న టార్చ్ లైట్ ఆన్ చేసి చూడగా అందులో తెల్ల ప్లాస్టిక్ స్పూన్ చూసి ఆశ్చర్యపోయాడు.

Prajwal Revanna: కొడుకు స్కూల్ అడ్మిషన్‌కి వెళ్తే వర్చువల్ సె*క్స్ కోసం బలవంతం.. ప్రజ్వల్ రేవణ్ణ దుర్మార్గం..

అయితే ఆ యువకుడు వెంటనే తాను కొన్న షాప్ వద్దకు వెళ్లి ఇందులో స్పూన్ ఉందని ప్రశ్నించగా.. దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయితే తాము కేవలం వాటిని విక్రయించే వరకు మాత్రమేనని వారు చెప్పడంతో ఆ యువకుడు ఆఫీసులో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళాడు. అయితే అక్కడ అధికారులు ఆ యువకుడు ఈ విషయంపై కంప్లైంట్ చేస్తుండగా అక్కడ ఎవరు స్పందించకపోవడం, మాకు సంబంధం లేదని మీరు నంద్యాల వెళ్లి ఫిర్యాదు చేసుకోండి అంటూ తెలిపారు. దాంతో ఆయన కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Parliament: లోక్‌సభలో ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్.. వీడియో..

అయితే ఈ విషయంపై ఎవరు స్పందించకపోవడంతో.. ఆ యువకుడు మద్యం దుకాణం ముందే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపిస్తూ., ఇందులో ఇప్పుడు స్పూన్ మాత్రమే వచ్చింది. స్పూన్ కాకుండా వేరే ఏదైనా రాకూడదని వస్తే మా ఆరోగ్యం ఏమైపోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కొనుక్కున్న రోజే తాము దీన్ని తాగి ఉంటే.. ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ ఆ యువకుడు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.