Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
- ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా..
- పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ నిర్వహిస్తూ, అనవసర ఖర్చులు లేకుండా సినిమా షూటింగ్..
- చిరంజీవి ‘స్పిరిట్’లో నటిస్తున్నారనే వార్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spirit: రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ‘యానిమల్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సందీప్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొద్ది రోజులుగా ఈ చిత్రంలో అంతర్జాతీయ కొరియన్ స్టార్ డాన్ లీ (Ma Dong-seok) విలన్‌గా నటిస్తున్నారని, అలాగే మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక అతిథి పాత్రలో కనిపిస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ ప్రచారాలపై తాజాగా ‘స్పిరిట్’ సహ నిర్మాత, సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా NTVతో జరిగిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
డాన్ లీ క్యాస్టింగ్ రూమర్లపై ప్రణయ్ స్పందిస్తూ.. “డాన్ లీని ప్రాజెక్ట్‌లోకి తీసుకురావాలని ప్రారంభంలో ఆలోచించాం. కానీ ‘స్పిరిట్’ అనేది పక్కా లోకల్ హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ. కథలోని ఎమోషన్, పాత్రల సహజత్వం దెబ్బతినకుండా ఉండాలంటే బయటి వ్యక్తుల కంటే ఇక్కడి నేటివిటీకి సరిపోయే నటులే అవసరం. సందీప్ ఎప్పుడూ కథకు, స్క్రిప్ట్‌కు ఏది అవసరమో దానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, కేవలం హైప్ కోసం స్టార్లను ఇరికించరు” అని స్పష్టం చేశారు.
Also Read
- Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
ఇది ఇలా ఉండగా మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ ప్రచారాలన్నీ కేవలం ఊహాగానాలేనని, స్క్రిప్ట్ డిమాండ్ చేసిన పాత్రలకు మాత్రమే సరైన నటీనటులను లాక్ చేస్తున్నామని వివరించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంతో పాటు ఎడిటింగ్, మ్యూజిక్, ప్రొడక్షన్ ఖర్చులపై పూర్తి నియంత్రణ కలిగిన దర్శకుడని ప్రణయ్ తెలిపారు. ఎక్కడా రూపాయి వృథా కాకుండా పక్కా ప్లానింగ్‌తో ‘స్పిరిట్’ చిత్రీకరణను జరుపుతున్నామని, ఈ చిత్రం ప్రభాస్ అభిమానులకు సరికొత్త యాక్షన్ విందును అందించనుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ స్పష్టతతో గత కొద్ది రోజులుగా డాన్ లీ మరియు చిరంజీవి ఎంట్రీపై జరుగుతున్న రూమర్లకు అధికారికంగా తెరపడింది.
తాజావార్తలు
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?