NTV Telugu Site icon

Spiderman: స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్సుల్లో రోడ్డుపై రెచ్చిపోయిన యువ జంట.. సీన్ కట్ చేస్తే..

Spider Man Viral Video

Spider Man Viral Video

ప్రస్తుతం ప్రపంచంలోని యువత సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంతటి రిస్కు తీసుకోవడానికి వారు తయారైపోతున్నారు. ఇలా ఒక్కోసారి ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా చివరికి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరైతే రోడ్లపై విన్యాసాలు చేస్తూ రోడ్లపై వెళ్లేవారిని డిస్టర్బ్ చేస్తూన్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. ఈ లిస్టులో తాజాగా మరో వీడియో కూడా చేరింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో గురించి చూస్తే..

Also read: AP Elections 2024: ముగిసిన నామినేషన్ల స్క్రూట్నీ.. ఫైనల్‌గా బరిలో నిలిచింది ఎవరంటే..?

ఓ యువ జంట స్పైడర్ మ్యాన్‌, స్పైడర్ ఉమెన్ డ్రస్సులను ధరించి ఢిల్లీ వీధుల్లో బైక్ షికారుకు బయలుదేరింది. ఇక వైరల్ గా మారిన ఈ వీడియోలో మొదట్లో స్పైడర్ మ్యాన్‌ దుస్తుల్లో ఉన్న యువకుడు రోడ్డుపై బైకు నడుపుతూ మార్గమధ్యంలో బండి ఒక వైపుకు ఆపి వీడియోలకు ఫోజులు ఇచ్చాడు. ఆ తర్వాత బైక్ పై ముందుకు వెళుతూ.. తన గర్ల్ ఫ్రెండ్ ను స్పైడర్ గర్ల్ దుస్తులు ధరించి ఆ బండి ఎక్కింది. దాంతో ఢిల్లీ నగర వీధుల్లో బైకుపై వారిద్దరూ హల్చల్ చేశారు.

Also read: Loksabha Elections 2024: ఆదర్శంగా నిలిచిన 106 ఏళ్ల బామ్మ.. ఓటేసిన వృద్ధురాలు

బైక్ పై ప్రయాణం చేసే సమయంలో వీరిద్దరూ ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ.. గాలిలో చేతులు పైకెత్తి బండి పైన డ్యాన్సులు చేయడం మొదలుపెట్టారు. ట్రాఫిక్ రూల్స్ పక్కనపెట్టి., విచిత్ర విన్యాసాలు చేస్తూ వారి ప్రాణాలను రిస్కులో పెట్టారు. ఈ వీడియో చిత్రీకరణ నజాఫ్‌గడ్‌ లోని రహదారిపై జరిగినట్లుగా తెలుస్తోంది. నజాఫ్‌గడ్‌కు చెందిన ఆదిత్య వర్మతో పాటు ఓ యువతి ఈ స్టంట్ లో పాల్గొనుంది. ఇక వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో చివరికి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల దృష్టికి చేరింది. దాంతో సదరు జంటను పోలీసులు అదుపులోకి తీసుకొని ఎంవిఐ చట్టాలకింద వీరికి భారీ జరిమానాను విధించారు. ముఖ్యంగా బైకుకు నెంబర్ ప్లేట్ లేకుండా బైక్ నడపడంతో పాటు., హెల్మెట్ ధరించకపోవడం లాంటి వివిధ సెక్షన్ల కింద వారికి చలానాలను జారీ చేశారు.

Show comments