Site icon NTV Telugu

Spider-Man: రికార్డుల మోత మోగిస్తున్న స్పైడర్ మ్యాన్.. ఒక్క ట్రైలర్‌కే 100 కోట్ల వ్యూస్!

Spider Man

Spider Man

Spider-Man: గ్లోబల్ సూపర్ హీరో ‘స్పైడర్ మ్యాన్’ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి తెలిసింది. తాజాగా విడుదలైన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఏకంగా 1 బిలియన్ (100 కోట్లు) వ్యూస్ మార్కును దాటి అంతర్జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అలరించనున్నాడు. అతనికి జోడీగా జెండయా నటిస్తుండగా.. జాకబ్ బాటలన్, సాడీ సింక్, జాన్ బెర్న్తాల్, మార్క్ రుఫలో, మైఖేల్ మాండో వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా మార్క్ రుఫలో (హల్క్) ప్రస్తావన ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

READ ALSO: మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. భారతదేశంలో ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. అన్ని ప్రీమియం ఫార్మాట్లలో (IMAX, 3D, 4DX) స్పైడర్ మ్యాన్ సందడి చేయనున్నాడు. గత చిత్రాల రికార్డులను తిరగరాస్తూ, ఈ ‘బ్రాండ్ న్యూ డే’ ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందోనని సినీ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

READ ALSO: Iran Missile Man: అమెరికానే అల్లాడిస్తున్న ఇరాన్ ‘మిస్సైల్ మ్యాన్’.. ఇరాన్ రాకెట్లకు ‘బాస్’ ఇతనే?

Exit mobile version