NTV Telugu Site icon

Governor Convoy: గవర్నర్ కాన్వాయ్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు అరెస్ట్

Kerala Governor

Kerala Governor

Governor Convoy: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కాన్వాయ్‌లోకి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. శుక్రవారం రాత్రి నోయిడాలో ఒక కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీకి వెళుతుండగా ఆయన కాన్వాయ్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఆయన భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు గవర్నర్ కాన్వాయ్‌ను ఢీకొట్టినందుకు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు వెల్లడించారు.

Also Read: Richest Woman: ఢిల్లీలో అత్యంత సంపన్న మహిళ ఎవరు.. ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?

వేగంగా వచ్చిన వాహనం గవర్నర్ కాన్వాయ్‌ను రెండుసార్లు ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించి నల్లటి స్కార్పియో కారును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను ఘజియాబాద్‌కు చెందిన గౌరవ్ సోలంకి, మోను కుమార్‌లుగా గుర్తించారు.