Site icon NTV Telugu

Pawan Kalyan : స్పీడ్ స్టార్ పవర్ స్టార్.. ఉస్తాద్ ఆల్మోస్ట్ ఫినిష్

Pawan Kalyan

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. హరిహర వీరమల్లు ను ప్రమోషన్స్ హడావిడి ముగిసిన వెంటనే గ్యాప్ లేకుండా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు పవర్ స్టార్. ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ నిర్మిస్తున్నారు.

Also Read : Jr. NTR : వార్ – 2 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్స్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోర్షన్ ను చక చక ఫినిష్ చేసేస్తున్నారట. అందుకు అనుగుణంగా పవర్ స్టార్ కూడా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారట. తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో నిర్మాత నవీన్ మాట్లాడుతూ ‘ ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కు ఇంకో వారం షూట్  మాత్రమే ఉంది. అది కాకుండా రిమైనింగ్ సినిమా ఇంకో ఇరవై నుండి ఇరవై ఐదు రోజులు షూట్ బ్యాలెన్స్ ఉంది.  ఇప్ప్పుడు బంద్ వలన కాస్త డిలే అయింది. షూటింగ్స్ తిరిగి స్టార్ట్ కాగానే పవన్ కళ్యాణ్ షూట్ ను స్టార్ట్ చేసి ఫినిష్ చేస్తాం. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుమాస్ ప్రేక్షకులు, యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఈ చిత్రం ఉంటుందని ‘ అని అన్నారు. మొత్తానికి పోలికల్ రీజన్స్ కారణంగా పక్కన పెట్టిన సినిమాలను ఇప్పడు ఒక్క్కొకటిగా ఫినిష్ చేస్తు ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు.

Exit mobile version