AP Elections 2024 Results: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది.. రేపు ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రారంభించి ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, కౌంటింగ్ సందర్భంగా అప్రమత్తమయ్యారు పోలీసులు.. ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై నిఘా పెట్టారు.. ఈ రోజు సాయంత్రం నుంచి కౌంటింగ్ ముగిసే వరకు 126 మంది రౌడీ షీటర్స్ ను గృహనిర్బంధం చేయాలని నిర్ణయించారు. కడప జిల్లా వ్యాప్తంగా 1,038 మంది రౌడీలకు ఇప్పటికే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌంటింగ్ రోజు ఘర్షణలు జరగకుండా ఉండేందుకు 652 మందిని నేటి సాయంత్రం నుంచి అదుపులోకి తీసుకోనున్నట్టు పోలీసులు వెల్లడించారు.. జిల్లా వ్యాప్తంగా 21 మంది రౌడీ షీటర్లు జిల్లా బహిష్కరణ చర్యలకు పూనుకున్నారు. మిగిలిన ట్రబుల్ మాంగర్స్ ఇంటికే పరిమితం కావాలని స్పష్టం చేశారు.
Read Also: Telangana Rains: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు వర్షాలు..
ఈ రోజు రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం కనిపించబోతోంది.. షాపులు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.. రేపు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.. ఇక, కౌంటింగ్ సిబ్బందికి రెండవ రాండమైజేషన్ పద్ధతిలో రాత్రి విధులు కేటాయించిన జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు.. 1035 మంది సిబ్బంది కౌంటింగ్ విధులలో పాల్గొననున్నారు. కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లకు విధులు కేటాయించారు. రేపు ఉదయం 5 గంటలకు మరోసారి విధులు కేటాయించనున్నారు ఎన్నికల అధికారులు.. ఏ నియోజకవర్గం..? ఏ టేబుల్..? ఇలా విధులను కేటాయించనున్నారు. రేపు ఉదయం 5 గంటలకు కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ సెంటర్‌లో హాజరుకావాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి.
