NTV Telugu Site icon

Irfan Pathan: ఇర్ఫాన్ పఠాన్ ఇంట్లో ఆఫ్ఘనిస్తాన్ టీమ్కు స్పెషల్ పార్టీ..

Irfan Pathan

Irfan Pathan

వరల్డ్ కప్‌ 2023లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు మంచి ప్రదర్శన కనబరుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో గెలువగా.. మూడు ఓడిపోయింది. ఈ క్రమంలో ఆఫ్ఘాన్ జట్టుకు 8 పాయింట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈరోజు ఆస్ట్రేలియాతో కలిసి ఆఫ్ఘాన్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ తో సెమీస్ బెర్త్ ఖాయమవుతుందా లేదా అనేది తేలిపోతుంది.

Read Also: Delhi: కాలుష్య కోరల్లో ఉత్తరాది.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు..

ఇదిలా ఉంటే.. ఇటీవలే టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన ఇంట్లో ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్ల కోసం ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో హర్భజన్ సింగ్, అద్నాన్ సమీ, ప్రముఖ నటుడు సునీల్ శెట్టి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అందుకు సంబంధించి.. అద్నాన్ సమీ X (ట్విట్టర్)లో ఒక ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో ఇర్ఫాన్ పఠాన్ ఇంటికి సంబంధించినది. ఇర్ఫాన్ తన నివాసంలో పార్టీ ఏర్పాటు చేశాడు. ఇందులో సునీల్ శెట్టి, అద్నాన్ సమీ, హర్భజన్ సింగ్, ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇర్ఫాన్ పఠాన్ ఇంట్లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఆటగాళ్లతో అందమైన సాయంత్రం’ అని అద్నాన్ ఫోటో షేర్ చేసి క్యాప్షన్ ఇచ్చారు. అద్నాన్ సమీ షేర్ చేసిన ఈ ఫోటోను వందలాది మంది అభిమానులు లైక్ చేశారు. అంతేకాకుండా.. పలువురు అభిమానులు కామెంట్లు కూడా చేస్తున్నారు.

Read Also: Bharat Jodo Yatra 2.0: రెండో విడత భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ సిద్ధం.. అప్పటి నుంచేనా..?

ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లతో ఇర్ఫాన్ పఠాన్‌కు చాలా మంచి స్నేహబంధం ఉండడం గమనార్హం. ఆఫ్ఘాన్ జట్టు తరుఫున ఇర్ఫాన్ సపోర్ట్ చేయడం చాలా సందర్భాల్లో చూశాం. అంతకుముందు ఆఫ్ఘన్ ఆటగాళ్లతో ఇర్ఫాన్ ఉన్న వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఆటగాళ్లతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఇర్ఫాన్ రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, నవీన్ ఉల్ హక్‌లతో పాటు మొత్తం జట్టును తన ఇంటికి ఆహ్వానించాడు. అందులో ఇమ్రాన్ తాహిర్, హర్భజన్ సింగ్, యూసఫ్ పఠాన్ కూడా పాల్గొన్నారు.

Show comments