NTV Telugu Site icon

Tigers: టైగర్‌ రిజర్వు ఫారెస్టులో పెద్దపులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..

Tigers

Tigers

టైగర్ రిజర్వు పరిధిలో పెద్ద పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఫీల్డ్ డైరెక్టర్ బీఎన్ఎన్ మూర్తి తెలిపారు. గత ఏడాది మార్చిలో తప్పిపోయిన 4 పెద్దపులి పిల్లలు తిరపతి జూపార్క్ లో ఉంచామని చెప్పుకొచ్చారు. పెద్దపులి పిల్లలను రివైల్డింగ్ కోసం మార్కాపురం పరిధి కొర్రప్రోలు రేంజ్ లో రివైల్డింగ్ ఎంక్లోజర్ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 50 శాతం ఎన్ క్లోజర్ పూర్తి చేసాం, మరో 2 నెలల్లో ఎన్ క్లోజర్ ని పూర్తిస్థాయిలో నిర్మిస్తాం అని ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి వెల్లడించారు. రివైల్డింగ్ ఎంక్లోజర్ కోసం ఇప్పటికే ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేశాం.. దానిలో ట్రైనీ, శాస్త్రవేత్త వన్యప్రాణి సంరక్షణ ట్రైనర్ ఉంటారు అని బీఎన్ఎన్ మూర్తి పేర్కొన్నారు.

Read Also: Online Trolling: బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేక్‌అప్ తర్వాత టీనేజర్‌పై ట్రోలింగ్.. ఆత్మహత్య..

ఇక, ఎన్ క్లోజర్ లో పెట్టడానికి పెద్దపులి పిల్లలు బాగున్నాయా లేదా అని చూసి ఇక్కడికి తీసుకొస్తామని ఫారెస్ట్ ఫీల్డ్ డైరెక్టర్ బీఎన్ఎన్ మూర్తి చెప్పుకొచ్చారు. పెద్దపులి పిల్లలను ఎన్ క్లోజర్ కు తీసుకొని వచ్చి ప్రోటోకాల్ ప్రకారం హంటింగ్ నేర్పించి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయం ప్రకారం వాటిని ఇక్కడికి తీసుకొని వచ్చి రివైల్డింగ్ చేయడానికి అవసరమైన అన్ని నేర్పిస్తామన్నారు పేర్కొన్నారు. పెద్దపులి పిల్లలకు తగిన రక్షణ కల్పిస్తామని చెప్పారు.