Online Trolling: బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేక్‌అప్ తర్వాత టీనేజర్‌పై ట్రోలింగ్.. ఆత్మహత్య..
- బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పినందుకు ట్రోలింగ్..
- 18 ఏళ్ల యువతి ఆదిత్య నాయర్ ఆత్మహత్య..
- సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఫేమస్..
- బాయ్‌ఫ్రెండ్ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Trolling: ఆన్‌లైన్ ట్రోలింగ్ 12 వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ప్రాణాలను తీసింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను వేధించారు. అదే పనిగా ట్రోలింగ్ చేయడంతో బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి బంధువులు పేర్కొన్నారు. ఈ ఘటన కేరళలో జరిగింది. కేరళకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయింది. దీని తర్వాత ఆమెను ట్రోలింగ్ చేయడం ద్వారా మానసికంగా హింసించారు. దీంతో ఆమె బలవన్మరనానికి పాల్పడింది.
Read Also: Hyderabad: కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రి.. నిరాకరించడంతో దారుణ హత్య
Also Read
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
12వ తరగతి చదువుతున్న 18 ఏళ్ల యూట్యూబర్ ఆదిత్య ఎస్ నాయర్ గత వారం తిరువనంతపురంలోని తన ఇంటిలో ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంలో ఐసీయూలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేక్‌అప్ చెప్పిన తర్వాత నుంచి ఆదిత్య ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులకు గురవుతున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిరంతర ట్రోలింగ్ ఆమె మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసింది. ఆమె లవ్ ఎఫైర్ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు చదువుపై దృష్టిపెట్టాలని సూచించడంతో, ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌కి రెండు నెలల క్రితం బ్రేకప్ చెప్పింది.
ఈ కేసులో ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని తిరువనంతపురంలోని ఉజమలక్కల్‌కు చెందిన బినోయ్‌గా గుర్తించారు. ఆదిత్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పూజపురా పోలీసులు బినోయ్‌పై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.ఎఫ్ఐఆర్ ప్రకారం, ఇద్దరు కూడా ఇద్దరు కూడా రొమాంటిక్ రిలేషన్ కలిగి ఉన్నారు. ఈ విషయాన్ని అమ్మాయి తన తల్లిదండ్రులకు వెళ్లడించిన తర్వాత అబ్బాయి కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాత తాము ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. ప్లస్-2 పరీక్షలు జరుగుతున్నందున వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆదిత్య యుక్త వయసుకు రాకముందు నుంచే రిలేషన్ కలిగి ఉన్నట్లు తేలింది. ఆదిత్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారు.
తాజావార్తలు
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
-
Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
-
CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
ట్రెండింగ్
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!