NTV Telugu Site icon

SIT Investigation: అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లోనే సిట్ మకాం

Sit

Sit

SIT Investigation: ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాథమిక రిపోర్టు ఇచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లోనే ఇంకా మకాం వేసింది. మూడు బృందాలుగా విడిపోయిన అధికారులు తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో ఉన్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయి పర్యటనలు పూర్తి చేశారు. అవసరమైతే మళ్ళీ దాడులు జరిగిన ప్రాంతాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. మొత్తం 33 కేసులు నమోదయ్యాయి. మొత్తం 124 మందిని అరెస్ట్ చేశారు. నరసరావు పేట, మాచర్ల పరిధిలో స్థానిక పోలీసులు ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. అల్లర్లలో మొత్తం 1370 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో 1152 మంది పరారీలో ఉన్నట్టు సిట్ గుర్తించింది. తాడిపత్రిలో 636 మంది, పల్నాడు జిల్లాలో 471 మంది, తిరుపతిలో 41 మంది పరారీలో ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఆయా జిల్లాల్లో పోలీసులు విచారిస్తున్న తీరుపై సిట్‌ మరో నివేదిక ఇవ్వనుంది. ఇవాళ మరోసారి తాడిపత్రికి సిట్‌ బృందం వెళ్లనుంది. పోలింగ్‌ తర్వాత జరిగిన కేసుల్లో జిల్లాల పోలీసులు విచారిస్తున్న తీరుపై ఆరా తీయనుంది. తాడిపత్రిలో 728 మంది అల్లర్లలో పాల్గొన్నట్లు సిట్‌ గుర్తించింది. తాడిపత్రిలో 634 మంది పరారీలో ఉండగా.. అందులో 332 మంది నిందితులను గుర్తించాల్సి ఉన్నట్టు నిర్ధారించింది. ఆయా జిల్లాల పోలీసులు కేసులు విచారిస్తున్న తీరుపై సిట్ మరో నివేదిక ఇవ్వనుంది.

 

Read Also: Weather: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు!