Site icon NTV Telugu

CM Revanth: భూ సంబంధిత వివాదాలకు పరిష్కారానికి ప్రత్యేక కమిటీ

Revanth

Revanth

రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారానికై తగు మార్గ దర్శకాలను ప్రతిపాదించేందుకు గాను ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ధరణి పనితీరు, భూ సంబంధిత అంశాలపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు దామోదర రాజ నర్సింహా, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, తదితర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

Amruta Subhash : ఆ ఇంటిమేట్ సీన్స్ చేయడానికి నా భర్తే నన్ను ఎంకరేజ్ చేశారు..

ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. భూసంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా ఈ కమిటీ ప్రతిపాదనలను సూచించాలన్నారు. ఈ కమిటీలో మంత్రులతోపాటు రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ సంబంధిత చట్టాల్లో నిష్ణాతులు సభ్యులుగా ఉండాలన్నారు.

Sajjala Ramakrishna Reddy: టీడీపీ రాజకీయ పార్టీగా ఉనికి కోల్పోయింది.. అది ఒక ముఠా..

ధరణి ప్రారంభంనుండి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలపై సవివర నివేదిక అందచేయాలని ముఖ్యమంత్రి సీఎస్ ను ఆదేశించారు. ఈ సమావేశంలో సి.ఎం.ఓ అధికారులు శివధర్ రెడ్డి, శేషాద్రి, షా-నవాజ్ ఖాసీంలు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రైతు ప్రతినిధులు కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, సంపత్ కుమార్ రెవిన్యూ అసోసియేషన్ ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Exit mobile version