NTV Telugu Site icon

APSRTC: ఎన్నికల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..

Apsrtc

Apsrtc

మే 13న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అందుకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మే 8 నుండి 12 తేదీ వరకు హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు రెగ్యులర్ గా నడిచే సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు ఉండనున్నాయని తెలిపింది. హైదరాబాద్ నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజూ నడిచే 339 సర్వీసులతో పాటు 11వ తేదీన 302, 12 వ తేదీన 206 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొంది. రోజు హైదరాబాద్ నుండి ఒంగోలు 38, ఏలూరుకు 20 బస్సులు, మచిలీపట్నంకు 23, విజయవాడకు 45, గుంటూరు 18, నరసరావు పేట 26, నెల్లూరు 17, నంద్యాల 19, విశాఖపట్నం 4 ప్రత్యేక బస్సులు నడుపుతుంది.

Court Shocked To School: ముఖాలు నల్లగా ఉన్నాయంటూ విద్యార్థులను బహిష్కరణ చేసిన స్కూలు యాజమాన్యం..

హైదరాబాద్- బిహెచ్ఈ. ఎల్, ఎం. జి. బి. ఎస్, ఈ. సి. ఐ. ఎల్, జీడిమెట్ల, రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుండి ఏపీకి ప్రత్యేక బస్సులు సర్వీసులు నడవనున్నాయి. మరోవైపు.. ఓట్ల పండుగ కోసం పోటెత్తిన ఓటర్లతో విజయవాడ బస్ స్టేషన్ రద్దీగా మారింది. ఈ క్రమంలో.. విజయవాడ నుండి విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, గుంటూరు తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతుంది. అటు.. బెంగుళూరు నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 11వ తేదీన మొత్తం 323 బస్సులు, 12వ తేదీన 269 బస్సులు నడపుతున్నారు. ప్రత్యేక బస్సులు కూడా సాధారణ ఛార్జీలతోనే నడపబడతున్నాయి. ఓటు వేసి తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం కూడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు.

Guntur Collector: ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి..

మరోవైపు.. ఎన్నికల వేళ ప్రైవేట్‌ ట్రావెల్స్ రెచ్చిపోతున్నాయి. ప్రయాణికులను అడ్డంగా దోచేస్తున్నాయి. ఉద్యోగాలు, చదువుల పేరుతో ప్రజలు సొంత ఊర్లకు దూరంగా ఎక్కడెక్కడో సెటిల్‌ అయిన జనాలు.. సొంత ఊర్లకు వెళ్తున్న ప్రయాణికులు డబ్బులు దండుకుంటున్నారు. ఓ పక్క ఆర్టీసీ బస్సులు, రైళ్లు ఫుల్ అయిపోయాయి. దీంతో.. ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ జనాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ టికెట్ రేట్లు 2500 నుంచి 5 వేల వరకూ చూపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కడప, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలాంటి ప్రధాన నగరాలకు కూడా ఇదే రేంజులో టికెట్ రేట్లు ఉన్నాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.