NTV Telugu Site icon

GSAT-20: నింగిలోకి దూసుకుపోయిన జీశాట్-20 శాటిలైట్

Gsat

Gsat

GSAT-20: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన అత్యంత అధునాతన సమాచార శాటిలైట్ జీశాట్‌-20 (జీశాట్‌-N2) నింగిలోకి దూసుకుపోయింది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ఈ జీశాట్‌-20ను నింగిలోకి మోసుకుపోయింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్‌ కెనావెరల్‌ వేదికగా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. సుమారు 34 నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశ పెట్టారు.

Read Also: AUS vs IND: ఆస్ట్రేలియాకు షాక్.. పెర్త్ టెస్ట్‌కు కీలక వ్యక్తి దూరం! కారణం ఐపీఎల్

కాగా, 4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్‌లు తీసుకెళ్లేందుకు సాధ్యపడలేదు.. దీంతో స్పేస్‌ ఎక్స్‌ ద్వారా ఇస్రో ప్రయోగించింది. జీశాట్‌-20 శాటిలైట్ 14 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. వాణిజ్య పరంగా ఇస్రో, స్పేస్‌ఎక్స్‌ మధ్య ఇదే తొలి ప్రయోగం అని చెప్పాలి. భారత్‌లోని మారుమూల ప్రాంతాలు, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌ లాంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్‌ సేవలను అందించడమే ఈ ఉపగ్రహం యొక్క ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా అడ్వాన్స్‌డ్‌ బ్యాండ్‌ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని తయారు చేసింది. జీశాట్‌-ఎన్‌2 శాటిలైట్ ద్వారా విమానాల్లో వై-ఫై సేవలు మరింత విస్తృతం కాబోతున్నాయి.