NTV Telugu Site icon

Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మృతి.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ కిషోర్

Sp

Sp

పాస్టర్ ప్రవీణ్ కేసుపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు. అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేస్తున్నామని.. ప్రధానంగా రెండు సీసీ ఫుటేజ్ లు లభించాయనీ తెలిపారు. హైదరాబాదు నుంచి బుల్లెట్ పై రాజమండ్రికి వస్తున్న సమయంలో సోమవారం అర్ధరాత్రి 11 గంటల 42 నిమిషాలకు ఒక కారుతోపాటు ఐదు వాహనాలు ప్రవీణ్ బుల్లెట్ ని దాటుకొని వెళ్లాయనీ సిసి ఫుటేజ్ ఆధారాలు ప్రదర్శించారు.. రెడ్ కలర్ కారు… ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ ఒకేసారి వెళ్లాయనీ.‌‌.. అత్యధిక టెక్నాలజీ ఉపయోగించి కారు కోసం విచారణ చేస్తున్నామనీ తెలిపారు.

Also Read:UP: రోడ్లపై “నమాజ్” చేస్తే పాస్‌పోర్టు, లైసెన్సులు రద్దు.. యూపీ పోలీసుల వార్నింగ్..

కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ నేతృత్వంలో ఇద్దరు సిఐలు, ఎస్సై లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామనీ.. ఈ కేసులో ఎవరి వద్ద అయినా బలమైన ఆధారాలు ఉంటే దర్యాప్తు బృందానికి అందించవచ్చునీ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తామని తెలిపారు. అయితే ఈ కేసులో ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణకు రాలేకపోతున్నామనీ.. సమగ్రమైన దర్యాప్తు చేసిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయనీ ఎస్పీ అన్నారు. ఈ కేసులో కొందరు సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారని.. వారంతా చట్టపరిధిలో ఉన్నట్టు గుర్తుంచుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు.