Site icon NTV Telugu

Adilabad: జాగిలాల కోసం ఈత కొలను.. ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్

Dog

Dog

అదిలాబాద్ జిల్లాలో పోలీసులు జాగిలాల కోసం ఓ ఈత కొలను ప్రారంభించారు. జాగిలాలకు వ్యాయామం చేయిస్తూ ఆరోగ్యంగా ఉండేలా వేసవి ఉపశమనంకై ఈత కొలను ప్రారంభించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. జిల్లాలో 8 జాగిలాలకు ప్రత్యేకంగా ఈత కొలను ఏర్పాటు చేయగా విధులను నిర్వర్తించి ఈత కొలనులో జలకాలాడి సేద తీరనున్నాయి జాగిలాలు. జాగిలాలు వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్నీ కాపాడుకుంటూ ఉన్నప్పుడు విధులయందు ఉత్తమ ప్రదర్శనను అందిస్తాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జాగిలాల బృందానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఈతకొలనును ప్రారంభించారు.

Also Read:Mithra Mandali: మ్యాడ్ నెస్ ఇప్పుడే మొదలైంది.. ఆకట్టుకుంటున్న ‘మిత్ర మండలి’ ఫస్ట్ లుక్

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జాగిలాలు విధులు నిర్వర్తించి సేద తీరడానికి ఈ ఈతకొలను ఉపయోగపడుతుందని తెలిపారు. వేసవికాలంలో ఎండ తీవ్రతను తట్టుకోవడానికి వాటి ఆరోగ్యం దృష్ట్యా ఈతకొలనును ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అదే విధంగా అత్యవసర సమయాలలో నదులలో, వాగులలో తమను తాము కాపాడుకోవడానికి, ఇతరులను రక్షించడానికి జాగిలాలకు ప్రత్యేకంగా ఈత అవసరం ఎంతగానో ఉంటుందని, అలాంటి సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మందస్తు జాగ్రత్తలతో ఈ ఈతకొలను ప్రారంభించి శిక్షణను అందజేయడం జరిగిందని తెలిపారు.

Also Read:Gang R*pe: ఛీ.. ఛీ.. అసలు తల్లేనా..? మైనర్‌ కూతురిపై 8 సార్లు గ్యాంగ్‌ రేప్‌ చేయించి..!

జిల్లాలో ప్రస్తుతం ఎనిమిది జాగిలాలు ఉండగా అందులో ఐదు పేలుడు పదార్థాలను కనుగొనే జాగిలాలు, రెండు నేరస్తులను పట్టుకునే విధంగా శిక్షణ పొందిన జాగిలాలు, మాదక ద్రవ్యాలను, గంజాయి లాంటి వాటిని కనుగొనడంలో ఉన్న ఒక జాగిలం అందుబాటులో ఉందని తెలిపారు. వీటన్నిటికీ ఈతకొలను ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డీఎస్పీ పోతారం శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి వెంకటి, ఎన్ చంద్రశేఖర్, డాగ్ స్క్వాడ్ ఇంచార్జ్ పి రమేష్, సాయుధ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version