జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అనసూయ వెళ్లిపోవడం తో ఆమె ప్లేసు లో వచ్చింది యాంకర్ సౌమ్య రావు.. ఈ అమ్మడు మొదట్లో తెలుగు సీరియల్స్ లో నటించేవారు అనంతరం ఈమె ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా యాంకర్ గా కొనసాగుతున్న సమయంలోనే సౌమ్య రావు కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తుంది..
ఇదిలా ఉంటే.. సౌమ్యా రావు జబర్దస్త్ నుంచి సిల్వర్ స్క్రీన్ ఛాన్స్ అందుకుందని టాక్. ఆమె యాంకరింగ్ టాలెంట్ చూసిన ఓ డైరెక్టర్ సినిమాలో ఆమెకు ఒక మంచి పాత్ర ఉందని ఆఫర్ చేశాడని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి… మాములుగా జబర్దస్త్ యాంకర్ గా చేస్తున్నారు అంటే అవకాశాలు వచ్చేస్తాయంతే అన్నట్టుగా.. మంచి రెమ్యూనరేషన్ ఆఫర్ చెయ్యడంతో సౌమ్య ఆ ఆఫర్ కి ఓకే అనేసిందట. సౌమ్య రావు కూడా వెండితెర మీద వెలుగు వెలగనుంది. జబర్దస్త్ తో ఆమె కెరీర్ పరంగా సెట్ అవడమే కాకుండా ఇప్పుడు సినిమా అవకాశాలు కూడా తెచ్చుకుంటుంది. ఈ విషయం తెలిసిన వారు లక్ అంటే ఆమెదే అనేస్తున్నారు.. అస్సలు భలే ఆఫర్స్ ను పట్టేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
ఇప్పటికే పలు సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు జబర్దస్త్ తో పాటు సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకొని అక్కడ కూడా స్టార్ పొజిషన్ కి చేరుకోబోతోందని చెప్పడం లో సందేహం లేదు.. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా గ్లామర్ మెరుపులు పెంచుతుంది.. ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్సులు వేస్తూ అదిరిపోయే లుక్ లో ఫోటోలకు పోజులు ఇస్తూ ఫోటోలను షేర్ చేస్తుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు సీరియల్స్ చేస్తూనే, యాంకరింగ్ చేస్తుంది..