Site icon NTV Telugu

South Heroines: బాలీవుడ్‌లో సౌత్ బ్యూటీస్ డిమాండ్.. వరుస ప్రాజెక్ట్స్ తో హీరోయిన్ బిజీబిజీ.?

Bollywood

Bollywood

South Heroines: ప్రస్తుతం సౌత్ సినిమాలు నేషనల్ మార్కెట్‌ తో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ లో భారీగా వసూళ్లు రాబట్టడంతో.. ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ దృష్టి మొత్తం సౌత్ హీరోయిన్స్‌పై పడింది. అందుకే రాబోయే బాలీవుడ్ సినిమాల స్క్రీన్ అంతా సౌత్ గ్లామర్‌తో కళకళలాడుతోంది. మరి ఈ ట్రెండ్‌ను నడిపిస్తున్న ఆ మోస్ట్ వాంటెడ్ సౌత్ బ్యూటీస్ ఎవరో ఒకసారి చూసేద్దామా..

Sai Dharam Tej: ‘సంబరాల ఏటిగట్టు’తో మెగా హీరో లైన్ లో పడినట్లేనా.?

యంగ్ సెన్సేషన్ శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న సినిమాతో ఆమె నార్త్‌లో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ చేస్తున్న శ్రీలీల, బాలీవుడ్ న్యూస్‌లో తెగ ట్రెండ్ అవుతుంది. అలాగే సీనియర్ సౌత్ బ్యూటీస్ కూడా నార్త్‌లో సూపర్ బిజీగా ఉన్నారు. ఇందులో ప్రముఖంగా చాలా గ్యాప్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ బాలీవుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే తమన్నా, రాశీ ఖన్నా, సమంత వంటి హీరోయిన్స్ బిగ్ స్క్రీన్, స్మార్ట్ స్క్రీన్ అనే తేడా లేకుండా అన్ని ఫార్మాట్స్‌లో కవర్ చేస్తూ దూసుకుపోతున్నారు.

Tollywood Diwali Clash: దీపావళి ధమాకా.. మూడు రోజుల్లో నలుగురు యంగ్ హీరోల భవితవ్యం.. టాలీవుడ్‌లో గట్టి పోటీ!

ఇక ఈ లిస్ట్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు నార్త్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ‘సికందర్’ ఒక్కటి మినహా బాలీవుడ్‌లో రష్మిక నటించిన సినిమాలన్నీ భారీ విజయాలు అందుకున్నాయి. ఇక నయనతార, కీర్తి సురేష్ లు కూడా ఒక్కో సినిమా మాత్రమే చేసినా అవి కూడా మంచి వసూళ్లు సాధించాయి. దీంతో సౌత్ బ్యూటీస్‌ను లక్కీ హీరోయిన్స్‌గా నార్త్ సినిమా మేకర్స్ భావిస్తున్నారు. ఇక సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా పేరొందిన సాయి పల్లవి బిగ్ ప్రాజెక్ట్‌లతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘రామాయణం’లో ఆమె సీత పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ సినిమాతో పాటు, జునైద్ ఖాన్కు జోడీగా ఓ లవ్ స్టోరీలో కూడా ఈ బ్యూటీ కనిపించబోతున్నారు. మొత్తానికి బాలీవుడ్ లో రాబోయే సినిమాలలో ఎక్కువగా మన సౌత్ గ్లామరే కనిపిస్తుందని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version