Site icon NTV Telugu

Trains Cancelled: తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే

Trains

Trains

తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే క్యాన్సిల్ చేసింది. విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో మెయింటనెన్స్ వర్క్స్ దృష్ట్యా పలు ట్రైన్స్ ను అధికారులు రద్దు చేశారు. ఇవాళ్టి నుంచి 23వ తేదీ వరకు మరికొన్ని రైళ్లను పాక్షికంగా క్యాన్సిల్ చేసి మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్లు తెలిపారు.

Read Also: Ameesha Patel : గదర్ 2 లో అలాంటి సన్నివేశం లేదు.. దయచేసి అలాంటి వీడియో వైరల్ చేయకండి…

విజయవాడ-బిట్రగుంట ట్రైన్‌ను 16వ తేదీ నుంచి 22 వరకు క్యాన్సిల్ చేయగా.. బిట్రగుంట-విజయవాడ, బిట్రగుంట-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్-బిట్రగుంట, రాజమండ్రి-విశాఖపట్నం, విశాఖపట్నం-రాజమండ్రి, కాకినాడ పోర్ట్-విశాఖపట్నం, విజయవాడ-విశాఖపట్నం, విశాఖపట్నం-విజయవాడ, విశాఖపట్నం-కాకినాడ పోర్ట్, విజయవాడ-గూడూరు రైళ్లను 17 నుంచి 23వ తేదీ వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. గూడురు-విజయవాడ ట్రైన్‌ను 18 నుంచి 24 వరకు రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్ అధికారులు పేర్కొంది.

Read Also: TTD EO Dharmareddy: శ్రీవాణి ట్రస్ట్‌కు ఇప్పటివరకు రూ.880 కోట్ల విరాళాలు

ఇక, నర్సాపూర్-గుంటూరు, గుంటూరు-నర్సాపూర్ ట్రైన్‌ను ఈ నెల 17 నుంచి 23వ తారీఖు వరకు విజయవాడ-గుంటూరు మధ్య పాక్షికంగా క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించారు. ధన్‌బాద్-అల్లెప్పి రైలును 18, 21, 22వ తేదీలలో, హటియా-బెంగళూరు రైలును 18న, టాటా-బెంగళూరు 21న, హటియా-బెంగళూరు రైళ్లను 22న నిడదవోలు, భీమవరం, గుడివాడ, విజయవాడ మీదుగా మళ్లించనున్నారు. అటు హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో పనుల కారణంగా తెలంగాణలోని పలు రైళ్లను ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. దీంతో, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Exit mobile version