NTV Telugu Site icon

South Central Railway GM : ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.. ప్రయాణికులు సురక్షితం

Arun Kumar Jain

Arun Kumar Jain

కాకినాడ నుంచి హైదరాబాద్‌ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ ఎన్ఎఫ్‌సి నగర్ వద్ద పట్టాలు తప్పింది. దీంతో.. ఆరు కోచ్ లకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రకటించారు. గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ప్రాంతాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పరిశీలించారు. ట్రాక్ పునరుద్దరణ పనులను జీఎం పర్యవేక్షించారు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖపట్టణం నుండి సికింద్రాబాద్ కు బయలుదేరిన గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు ఘట్ కేసర్ వద్ద పట్టాలు తప్పినట్టుగా చెప్పారు అరుణ్ కుమార్ జైన్. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. 6.15 నిమిషాల సమయంలో రైలు పట్టాలు తప్పినట్టుగా మాకు సమాచారం అందిందని, 16 పైగా భోగీలతో విశాఖ నుండి హైదరాబాద్ కు గోదావరి ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరిందన్నారు అరుణ్ కుమార్ జైన్.

Also Read : Trains Cancelled : పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

అందులో ఆరు బోగీలు పట్టాలు తప్పాయని, ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్య స్థానాలు చేర్చామని అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని, ఇవాళ రాత్రి వరకు ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. ప్రస్తుతం దెబ్బతిన్న రైల్వే లైన్‌ కాకుండా మరో లైన్‌ ద్వారా రైళ్లను నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

Also Read : Aero India 2023: ఏరో ఇండియా థీమ్‌ ఇదే