NTV Telugu Site icon

Trains Cancelled : పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

Trains

Trains

కాకినాడ నుంచి హైదరాబాద్‌ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ ఎన్ఎఫ్‌సి నగర్ వద్ద పట్టాలు తప్పింది. దీంతో.. ఆరు కోచ్ లకు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ కు స్టేషన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్‌-4 నుంచి మొత్తం ఆరు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. అయితే.. పట్టాలపై నుంచి కోచ్‌లు పక్కకు ఒరిగాయి. దీంతో.. సంఘటన స్థలానికి హుటాహుటిన రైల్వే ఉన్నతాధికారులు బయలుదేరారు. అయితే.. గంటకు 100 కి.మీ. స్పీడ్‌తో వెళ్తుండగా.. ఒక్కసారిగా రైలు పట్టాలు తప్పడంతో ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో ట్రాక్ మరమ్మతు పనులు జరుగుతున్నాయి.

Also Read : BBC Offices: బీబీసీ కార్యాలయాల్లో రెండో రోజూ ఐటీ సర్వే.. అమెరికా ఏమందంటే?

ఈ కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని పాక్షికంగా రద్దయ్యాయి. సికింద్రాబాద్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (12757), సిర్పూర్‌ కాగజ్‌నగర్‌- సికింద్రాబాద్‌ (12758), కాచిగూడ-నిజామాబాద్‌ (07596), నిజామాబాద్‌-కాచిగూడ (07593), కాచిగూడ-కరీంనగర్‌ (07793), కరీంనగర్‌-కాచిగూడ (07794), కరీంనగర్‌- నిజామాబాద్‌ (07894), నిజామాబాద్‌- కరీంనగర్‌ (07893), కాజీపేట – బల్లార్ష (17035), బల్లార్ష – కాజీపేట (17036), హెచ్‌ఎస్‌ నాందేడ్‌- నిజామాబాద్‌ (07854), నిజామాబాద్‌- హెచ్‌ఎస్‌ నాందేడ్‌ (07853), పూర్ణ-ఆదిలాబాద్‌ (07776), కాజీపేట-సిర్పూర్‌(టి) (17003), బల్లార్ష- కాజీపేట (17004), సిర్పూర్‌(టి)- కరీంనగర్‌ (07766), కరీంనగర్‌- సిర్పూర్‌(టి) (07765). ఇవే కాక మరో ఏడు ట్రైన్లు పాక్షికంగా రద్దయ్యాయి. రద్దు చేసిన రైళ్ల వివరాలను కాగజ్‌నగర్‌ సహా పలు రైల్వేస్టేషన్లలో నోటీసు బోర్డుల్లో రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.

Also Read : Bhagwant Mann : సాయంత్రం హైదరాబాద్‌కు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్