NTV Telugu Site icon

Chandrayaan 3: చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం ఎదురుచూస్తున్న సెలబ్రెటీలు, ట్విటర్ వేదికగా కోరుకున్న సౌత్ స్టార్స్

Chan

Chan

Chandrayaan 3: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ చంద్రయాన్ 3. విక్రమ్ రోవర్ ఈ రోజు చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టబోతుంది. ఇదే కనుక జరిగే భారత్ అంతరిక్ష పరిశోధనలో ఎలైట్ లిస్ట్ లో చేరుతుంది. అంతేకాకుండా జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్రకెక్కుతుంది. చంద్రయాన్ 3 చందమామపై సక్సెస్ ఫుల్ గా అడుగుపెట్టాలని దేశ వ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఎక్కడ చూసిన చంద్రయాన్ 3 గురించే చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి లైవ్ స్ట్రీమింగ్ ను కూడా ఇస్రోతో పాటు చాలా ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. ఆ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భారత్ తో పాటు యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది. జాబిల్లి రహస్యాలను తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే అన్ని ఘట్టాలను ఒక్కొక్కటిగా దాటుకుంటు వెళుతున్న  చంద్రయాన్ 3 ఆఖరి ఘట్టంలోకి మరికొన్ని గంటల్లో అడుగుపెట్టబోతుంది. ఇక ఇది సక్సెస్ అవ్వాలని చాలా మంది దేవుడిని ప్రార్థిస్తు ఇస్రోకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఇక  ఆ లిస్ట్ లోకి సౌత్ ఇండియన్ సెలబ్రెటీలు కూడా చేరారు. ఎంతో బిజీగా ఉండే వారు ట్విటర్ వేదికగా చంద్రయాన్ 3 విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇది భారతీయులందరు గర్వించదగిన నిమిషం అని పేర్కొ్నారు.

Also Read: Varun Tej: పెళ్లి తరువాత బన్నీ, చరణ్ ఎలా మారిపోయారో చెప్పిన వరుణ్ తేజ్

హీరో మాధవన్ చంద్రయాన్ 3 ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని, తన మాటలు రాసిపెట్టుకోండని ట్వీట్ చేశాడు. ఇస్రోకు ముందుగానే కంగ్రాట్స్ చెబుతున్నట్లు పేర్కొన్నాడు. నంబినారాయణ్ కు కూడా ఈ సందర్భంగా మాధవన్ కంగ్రాట్స్ చెప్పాడు. నంబినారాయణ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన రాకెట్రీ అనే సినిమాలో మాధవన్ నటించిన విషయం తెలిసిందే.

ఇక కాంతారాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి కూడా ట్విటర్ వేదికగా చంద్రయాన్ 3 పై స్పందించారు. చంద్రయాన్ 3 పంపిన జాబిల్లి ఫోటోలను ఆయన షేర్ చేసుకున్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి అని, దీనిని వీక్షించే అవకాశవం లభించడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని పేర్కొన్నాడు. చంద్రయాన్ 3 సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుందామని రిషబ్ శెట్టి పేర్కొన్నారు.

 

ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ట్విటర్ వేదికగా చంద్రయాన్ 3పై స్పందించారు. ఎంతో గర్వకారణమైన నిమిషం అంటూ చంద్రయాన్ 3 కి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇక ప్రకాశ్ రాజ్ ఒక్కడే చంద్రయాన్ 3 గురించి వెరైటీ ట్వీట్ చేసి విమర్శలపాలయిన సంగతి తెలిసిందే.