Site icon NTV Telugu

ODI World Cup: వ‌న్డే వరల్డ్ కప్ కు సౌతాఫ్రికా జ‌ట్టు ఇదే..!

South Africa

South Africa

భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు జరిగే వ‌న్డే వరల్డ్ కప్ జ‌ర‌ుగ‌నుంది. ఈ క్రమంలో ఈ వరల్డ్ కప్ లో పాల్గొనే సౌతాఫ్రికా జ‌ట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. మొత్తం 15 మందికి ఈ జ‌ట్టులో స్థానం కల్పించారు. టెంబా బవుమా నాయ‌క‌త్వంలో స‌ఫారీలు రంగంలోకి దిగ‌నున్నారు. బ్యాట‌ర్లు, బౌల‌ర్లు, ఆల్ రౌండర్లతో జ‌ట్టు చాలా ప‌టిష్టంగా స‌మ‌తూకంగా ఉంది.

Read Also: Health Tips: రోజూ 8 గ్లాసుల నీరు తాగుతున్నారా? అయితే మీరు తప్పకుండా ఇది తెలుసుకోవాల్సిందే

వన్డే ప్రపంచకప్ కు ఎంపిక చేసిన జట్టులో ప్రస్తుతం ఒక్క పేరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 22 ఏళ్ల రైట్‌ ఆర్మ్‌ పేసర్‌ గెరాల్డ్‌ కొయెట్జీ.. ఈ ఏడాది అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు.. ఇప్పటి వరకు రెండు వన్డేలు మాత్రమే ఆడిన ఈ ప్లేయర్.. 5 వికెట్లు తీసుకున్నాడు. ఇతడి ఒక్కడి ఎంపిక మిన‌హా మిగిలిన అంద‌రి ఎంపిక కూడా దాదాపుగా ఊహించిన విధంగానే ఉంది. డేవిడ్‌ మిల్లర్‌, రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌, క్వింటన్‌ డికాక్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌, రీజా హెండ్రిక్స్ లాంటి విధ్వంస‌క‌ర బ్యాట‌ర్లు స‌పారీ జట్టు సొంతం.

Read Also: Article 370: ఆర్టికల్ 370 రద్దుపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు..

ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించి స‌త్తా చాటిన ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్‌ల‌కు వరల్డ్ కప్ జట్టులో చోటు దొరకలేదు. ఇందుకు ప్రధాన కారణం.. ఇటీవ‌ల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో వీరు ఇద్దరు విఫ‌లం కావ‌డమే.. వరల్డ్ కప్ అనంతరం వ‌న్డేల నుంచి తప్పుకుంటున్నట్లు క్లింటన్ డికాక్ పేర్కొన్నాడు. ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా అక్టోబ‌ర్ 7న శ్రీలంక‌తో త‌న తొలి మ్యాచ్ ఆడ‌నుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక ఈ మ్యాచ్ జరుగనుంది.

Read Also: PM Modi: ఇండోనేషియా పర్యటనకు ప్రధాని.. ఆసియా సదస్సులో పాల్గొననున్న మోడీ

సౌతాఫ్రికా జట్టు ఇదే..
టెంబా బవుమా (కెప్టెన్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, క్వింటన్‌ డికాక్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌, రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌, రీజా హెండ్రిక్స్‌, కగిసో రబాడ, అన్రిచ్‌ నోర్జే, లుంగి ఎంగిడి, సిసండ మగాలా, గెరాల్డ్‌ కొయెట్జీ, మార్కో జన్సెన్‌, తబ్రేజ్‌ షంషి, కేశవ్‌ మహారాజ్‌ ఉన్నారు.

https://twitter.com/ProteasMenCSA/status/1698989565283856422

Exit mobile version