NTV Telugu Site icon

World Cup 2023: నేడు దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

Sa Vs Ban

Sa Vs Ban

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా ఈ రోజు 23వ మ్యాచ్ దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌లు గెలుపొందగా, బంగ్లాదేశ్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఇదిలా ఉంటే బంగ్లా కెప్టెన్ షకీబ్ తిరిగి జట్టులోకి రానున్నాడు. అటు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా కూడా తిరిగి టీమ్ లో చేరనున్నాడు.

Mega 156: పాత పద్దతిని తిరిగి తీసుకొచ్చిన మెగాస్టార్ అండ్ టీమ్

ఇదిలా ఉంటే.. ముంబైలోని వాంఖడే స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్‌లకు అనుకూలంగా ఉంటుంది. దానితో పాటు ఇక్కడ లక్ష్యాన్ని ఛేజ్ చేయడం సులభం. అయితే ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. ఈ మైదానంలో తొలుత ఆడిన దక్షిణాఫ్రికా ఇంగ్లండ్‌కు 400 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయినప్పటికీ ముందుగా టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.

Telangana: తెలంగాణలో చలి తీవ్రత.. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

మ్యాచ్ అంచనా చూసుకున్నట్లైతే.. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాదే పైచేయి అని మా మ్యాచ్ ప్రిడిక్షన్ మీటర్ చెబుతోంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడేలో జరుగుతుండగా.. ఈ మైదానంలో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా 399 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఆటగాళ్లు గొప్ప ఫామ్‌లో ఉన్నారు కావున.. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా సులువుగా విజయం సాధిస్తుంది.

సౌతాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్:
టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్‌సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, లుంగ్‌.

బంగ్లాదేశ్‌ ప్లేయింగ్ ఎలెవన్:
తంజీద్ హసన్, లిటన్ దాస్, మెహదీ హసన్ మిరాజ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), తౌహీద్ హృదయ్, మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫ్‌.

Show comments