Bjp May Drop Karnataka Mp: భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ వివాదాస్పద వ్యాక్యలు చేసిన కర్ణాటక ఎంపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డేకు బీజేపీ అధిష్టానం గట్టి షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి అనంత్ కుమార్ హెగ్డేను బరిలో దింపాలని నిర్ణయించిన బీజేపీ ఈ వివాదస్పద వ్యాఖ్యలతో ఆయన అభ్యర్థిత్వాన్ని రెండో జాబితా నుంచి తొలగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రెండో జాబితాను ఖరారు చేసేందుకు సోమవారం నాడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది.
Read Also: Seema Haider: సీఏఏ అమలుపై సీమా హైదర్ రియాక్షన్.. ప్రధానిపై ప్రశంసలు
అయితే, ఈ సమావేశంలో గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, చండీఘడ్, రాష్ట్రాల్లో దాదాపు 99 మంది అభ్యర్థులను సీఈసీ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇక, రాజ్యాంగంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన అనంత్ హెగ్డేకు రెండో జాబితాలో బీజేపీ మొండి చేయి చూపించే అవకాశం మెండుగా ఉంది. హెగ్డేతో పాటు కర్ణాటక నుంచి పలువురు ఎంపీలకు ఈసారి టికెట్లు దక్కే పరిస్ధితి కూడా లేదని పలువురు నేతలు అంటున్నారు.
Read Also: Akkineni Nagarjuna: పాకిస్థాన్ లో నాగార్జున.. నెలకు లక్షల్లో సంపాదన..?
ఇక, ఉడిపి, చిక్‌మంగళూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి శోభా కరంద్లాజెను బెంగళూర్ నార్త్ సీటుకు పంపించేందుకు కమలం పార్టీ చూస్తున్నట్లు టాక్. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని ఉడిపి నియోజక వర్గ పార్టీ నేతలు బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు లేఖ రాసినట్లు తెలుస్తుంది. ఇక మైసూర్ నుంచి ప్రతాప్ సింహా, దావణగెరె నుంచి మాజీ కేంద్ర మంత్రి సిద్ధేశ్వర, బళ్లారి నుంచి యరబసి దేవేంద్రప్ప ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉంది. అలాగే, కొప్పల్ నుంచి కరది సంగన్న అమరప్ప, మంగళూర్ నియోజకవర్గ ఎంపీ, రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ నలిన్ కుమార్ కటీల్‌కు స్ధాన చలనం.. లేదా టికెట్ నిరాకరించే ఛాన్స్ ఉందని సమాచారం.
