Akkineni Nagarjuna: పాకిస్థాన్ లో నాగార్జున.. నెలకు లక్షల్లో సంపాదన..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Nagarjuna: పాకిస్థాన్ లో నాగార్జున ఏంటి.. లక్షల్లో సంపాదించడం ఏంటి.. ఆయన ఇండియాలోనే ఉన్నారుగా అని డౌట్ పడకండి. అవును.. మన నాగార్జున ఇండియాలోనే ఉన్నారు. అయితే అచ్చు గుద్దినట్లు నాగార్జునలా ఉండే వ్యక్తి మాత్రం పాకిస్థాన్ లో ఉన్నాడు. ఉండడమే కాదు. నాగ్ లా మేకప్ వేసుకొని యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. నెలకు లక్షలు గడిస్తున్నాడు. ఈ మధ్య హీరోలను పోలిన వ్యక్తులు వారిలా మేకప్ వేసుకొని రీల్స్ చేసి సెలబ్రిటీలుగా మారుతున్న విషయం తెల్సిందే. అలానే నాగ్ లాంటి వ్యక్తి పాకిస్థాన్ లో కనిపించాడు. అతడి పేరే.. జైన్ అక్మల్ ఖాన్. టీనేజ్ వయసు నుంచి అతను నాగార్జునలా ఉన్నాడట. చాలామంది జైన్ ను చూసి.. ఇండియన్ హీరోలా ఉన్నావు అంటూ కామెంట్స్ చేసేవారట.
ఇక సోషల్ మీడియా వచ్చాకా.. అతను షికారీ మాస్ పేరుతో ఒక పుడ్ వ్లాగ్ ను మొదలుపెట్టాడు. అయితే ఈ వీడియోలు చూసిన కొంతమంది ఇండియన్స్.. నాగార్జునలా ఉన్నావ్ అని చెప్పడంతో.. అసలు నాగ్ ఎవరో తెలుసుకొనే ప్రయత్నం చేశాడట జైన్. అక్కినేని నాగార్జున ఇండియన్ హీరో అని, అతనికి ఒక సపరేట్ స్టైల్ ఉందని తెలుసుకొని.. నాగ్ లానే రెడీ అయ్యి.. ఆయన స్టైల్ లోనే మాట్లాడడం మొదలుపెట్టాడట. ఇక అలా చేసినదగ్గరనుంచి వీడియోస్, వ్యూస్ పెరిగి యూట్యూబ్ లో సంపాదన బాగా వస్తుందంట. ప్రస్తుతం ఈ యూట్యూబర్.. నెలకు దాదాపు మూడు నాలుగు లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం జైన్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
- అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ 'AK47' ఔట్? అసలు కారణం ఇదే..
Pakistan Media about King Nag Craze 🔥🔥🔥
This guy has become the biggest food vlogger of Pakistan entirely relying on Nag's craze 🔥 🔥 🔥@iamnagarjuna#Nagarjuna 👑👑👑 https://t.co/ISHYZx113G pic.twitter.com/eB6ZNeg8TZ— Nag Mama Rocks (@SravanPk4) March 10, 2024
తాజావార్తలు
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!