Site icon NTV Telugu

Sourav Ganguly: “ముందుంది ముసళ్ల పండుగ”.. విక్టరీ జోష్‌లో ఉన్న కోచ్‌ గంభీర్‌కు గంగూలీ హెచ్చరికలు..

Sourav Ganguly Warning

Sourav Ganguly Warning

Sourav Ganguly: టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026ను కైవసం చేసుకుంది. మూడు టీ20 వరల్డ్ కప్పులను సొంతం చేసుకున్న ప్రపంచంలోని ఏకైక టీమ్‌గా అవతరించింది. మొదటి నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న హెడ్ కోట్ గౌతమ్ గంభీర్‌కు ఇదో మంచి పరిణామం. రెండు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న తొలి భారత హెడ్ కోచ్‌గా గంభీర్ రికార్డు సృష్టించారు. ఈ మ్యాచుల్లో గంభీర్ వ్యూహాలు బాగా పని చేశాయి. అయితే.. ఈ జోష్‌లో ఉన్న టీమిండియాకు మాజీ కెప్టె్ సౌరవ్ గంగూలీ హెచ్చరికలు జారీ చేశారు. ముందుంది ముసళ్ల పండుగ అనే రీతిలో సూచనలు చేశారు. 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్పుతోనే అసలైన సవాలు మొదలు కానుందని వెల్లడించారు. “గంభీర్ అసలు సిసలైన సత్తా సౌతాఫ్రికా గడ్డపై బయటపడుతుంది. దక్షిణాఫ్రికాలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఆ పరిస్థితులు టీమ్‌ను, కోచ్‌ను సవాల్ చేస్తాయి. ప్రస్తుతం టీమిండియా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఈ జట్టుతో గంభీర్ ఆ సవాల్‌లను సమర్థవంతంగా ఎదుర్కొంటాడనిపిస్తోంది. గంభీర్‌పై నాకు నమ్మకం ఉంది.” అని గంగూలీ పేర్కొన్నారు.

READ MORE: Iran War: అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ భారీ దాడి..

గంభీర్ కేవలం టీ20, వన్డేలే కాకుండా టేస్టు్లోనూ తనదైన ముద్ర వేయాలని గంగూలీ సచించారు. రెడ్ బాల్ క్రికెట్‌లో మెరుగు పడాలన్నారు. టర్నింగ్ పిచ్‌ల మీద మాత్రమే ఆడాలనే ఆలోచనను పక్కన పెట్టి, మంచి వికెట్లపై ఆడితేనే మెరుగైన ఫలితాలు వస్తాయని హితవు పలికారు. గంభీర్ కోచ్ ప్రతిభను సమర్థిస్తూ.. కోచ్‌గా పూర్తి స్థాయిలో నిరూపించుకోవడానికి కొంత సమయం కావాలని సూచించాడు. మరోవైపు.. గంభీర్ 2027 వన్డే వరల్డ్ కప్పుపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాడు. ఈ వన్డే వరల్డ్ కప్పు రోహిత్ శర్మ, కోహ్లీలకు కీలకంగా మారనుంది. ఎందుకంటే.. ఈ సీజన్ తర్వాత వీళ్లు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఇద్దరు దిగ్గజాలను ఈ వరల్డ్ కప్పులో యూజ్ చేసుకునేందుకు బీసీసీఐ ప్రణాళిక ప్రారంభించింది. ఇక గంభీర్ అద్భుతమైన వ్యూహం తోడైతే ఈ కప్పుపై ఆశలు చిగురిస్తాయి.

READ MORE: Mahmudullah: భారత్ చేతిలో ఆ ఓటమి ఇప్పటికీ మర్చిపోలేము.. ఆటగాళ్లందరం బోరున ఏడ్చేశాం.!

Exit mobile version