Site icon NTV Telugu

Mamata Benerjee: దాదాకు మద్దతుగా దీదీ.. కేంద్రంపై మమత ఫైర్

Mamata Benerjee

Mamata Benerjee

Mamata Benerjee: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి మరోసారి మద్దతుగా నిలిచారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు. కుట్రపూరిత రాజకీయాలతోనే సౌరభ్‌ గంగూలీని ఐసీసీ ఛైర్మన్‌ పదవికి నామినేట్‌ చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సచిన్‌ టెండూల్కర్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌ను పక్కన పెట్టిన విధంగానే గంగూలీని తొలగించారని ఆమె విమర్శించారు. మరొకరి ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎన్నికల్లో పోరాడే అవకాశాన్ని సౌరవ్ గంగూలీ కోల్పోయారని ఆరోపించారు.

భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీని ఐసీసీ ఛైర్మన్‌ పదవికి నామినేట్‌ చేయకుండా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘సిగ్గులేని రాజకీయ ప్రతీకార చర్య’ చేపట్టిందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడిని రెండోసారి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగించినప్పుడు.. గంగూలీని ఎందుకు అధ్యక్షుడిగా కొనసాగించడం లేదని ప్రశ్నించారు. బీసీసీఐలో ఒకరి పదవి సురక్షితంగా ఉండటానికే.. గంగూలీని తప్పించారని ఆమె పేర్కొన్నారు. మమతా బెనర్జీ గత వారం సైతం ఈ విషయంపై తీవ్ర విమర్శలు చేశారు. సౌరవ్‌ గంగూలీని బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా వంచించారని ఆరోపించారు. గంగూలీని ఐసీసీకి పంపాలని ప్రధాని మోదీకి మమత విజ్ఞప్తి చేశారు.

Bandi Sanjay : పువ్వు గుర్తుపై ఓటేసి టీఆర్ఎస్ బాక్సును బద్దలు చేయండి

1983 ప్రపంచకప్‌ జట్టులో సభ్యుడైన రోజర్‌ బిన్నీ బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.అయితే మంగళవారం జరిగిన క్రీడా సంఘం వార్షిక సమావేశం ఐసీసీ ఎన్నికలపై చర్చించకుండానే ముగిసింది. ఇదిలా ఉండగా మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. తృణమూల్‌ కాంగ్రెస్ ఈ విషయాన్ని రాజకీయం చేయాలని భావిస్తోందని విమర్శించింది.

Exit mobile version