Site icon NTV Telugu

Sonu Sood : దేశంలోనే అతిపెద్ద మండి ప్లేటు.. ఆవిష్కరించిన సోనూసూద్

New Project (10)

New Project (10)

Sonu Sood : కరోనా టైంలో రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ ఓ వెజిటేరియన్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆయన పేరు మీద దేశంలోనే అతి పెద్ద మండి ప్లేట్ లాంచ్ అయింది. దీనిని హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న ‘గిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్‌’ మండి అభిమానుల కోసం తీసుకొచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్ స్వయంగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా దేశంలోనే అతిపెద్ద మండి ప్లేటును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బిగ్ బాస్ ఫేమ్ హిమజ, పలువురు సోషల్ మీడియా సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ బిగ్గెస్ట్ మండి ప్లేట్‌ వ్యాసం ఎనిమిది ఫీట్లు ఉంటుంది. ఒకేసారి 15 నుంచి 20 మంది భోజనం చేయవచ్చు. ఈ ప్లేట్‌లో భోజనం ఆర్డర్ చేసే వారికి.. అన్ లిమిటెడ్ చికెన్, మటన్ వంటకాలను అందిస్తారు.

Read Also: Women Menstruation : ఆ టైంలో మహిళలు మూడు రోజులు లీవ్ తీసుకోవచ్చు

హైదరాబాద్‌ లో చికెన్ బిర్యానీ తర్వాత.. మండి అంతే ఫేమస్..! ఈ అరేబియన్ వంటకానికి హైదరాబాదీలు ఫిదా అవుతున్నారు. అందుకే రాజధానిలో చాలా చోట్ల మండి రెస్టారెంట్లు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు వెరైటీ థీమ్‌లతో ముందుకొస్తున్నాయి. జైల్ థీమ్‌తో వచ్చిన ‘గిస్మత్ మండి రెస్టారెంట్.. నాన్ వెజ్ లవర్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఫుడ్ లవర్స్‌కి మరింత చేరువయ్యేందుకు ఇప్పుడు సరికొత్త అట్రాక్షన్‌ను తీసుకొచ్చింది. అదే ఇండియాస్ బిగ్గెస్ట్ మండి ప్లేట్. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్‌గా నిలుస్తుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. భోజన ప్రియులకు రకాల వంటకాల రుచులను అందించేందుకు గిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్ వారు ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లేట్ లాంచ్ చేయడం అభినందనీయమన్నారు.

Exit mobile version