Women Menstruation : ప్రపంచంలోని అన్ని దేశాలు లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలోనే వివిధ మహిళలు తమ విద్య, ఉపాధి కోసం వివిధ సంక్షేమ సౌకర్యాలను అమలు చేస్తున్నాయి. దీనికి తోడు ప్రపంచంలోని కొన్ని దేశాలు స్త్రీల సంక్షేమాన్ని ద్రుష్టిలో ఉంచుకుని ప్రసవం, రుతుక్రమం సమయంలో మహిళలకు సెలవులు ఇచ్చే విధానాన్ని అనుసకించడం ప్రారంభించాయి.
Read Also: Hair Detox: హెయిర్ స్టైల్కు అన్నీ వాడుతారు సరే.. తర్వాత అవి వదిలించుకోకపోతే అంతే
జపాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, జాంబియా వంటి ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే మహిళలకు పీరియడ్ లీవ్ ఇస్తాయి. యూరప్‌లో మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన రుతుక్రమ సెలవులను అందిస్తున్న తొలి దేశంగా స్పెయిన్ అవతరించింది. దేశాన్ని ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ నేతృత్వంలోని సోషలిస్టు ప్రభుత్వం పరిపాలిస్తోంది. రుతుస్రావం సమయంలో 3 రోజుల సెలవు కోసం ప్రభుత్వం దేశ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లుకు అనుకూలంగా 185 మంది, వ్యతిరేకంగా 154 మంది ఓటు వేశారు. దీంతో బిల్లు మెజారిటీతో ఆమోదం పొందింది.
Read Also: Automatic Sperm Extractor : ఇక వాటితో పనిలేదు.. అంతా మిషనే
దీంతో స్పెయిన్‌లో మహిళలకు రుతుక్రమ సెలవు చట్టం అమల్లోకి వచ్చింది. మహిళలు తమ 3 రోజుల సెలవులను అవసరమైతే 5 రోజులకు పొడిగించవచ్చని కూడా చట్టం పేర్కొంది. ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ వంటి దక్షిణాసియా దేశాలు చాలా కాలంగా ఈ రుతుక్రమ సెలవు చట్టాన్ని అమలు చేస్తున్నాయి. జపాన్‌లో, ఈ చట్టం 1947లో రూపొందించబడింది.. సుమారు 70ఏళ్లుగా అమలులో ఉంది.