Site icon NTV Telugu

Viral: డెలివరీ బాయ్ కు మద్దతుగా సోనూ సూద్.. బండబూతులు తిడుతున్న జనం

Sonu Sood

Sonu Sood

Viral: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోవిడ్ సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేసిన కృషి మరువలేనిది. నిరుపేదలకు అన్ని విధాలుగా సహాయం చేసిన సోను సూద్ తన సేవను ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఎక్స్‌లో సోనూసూద్ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల గురుగ్రామ్‌లో ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ కస్టమర్ ఇంటికి డెలివరీ చేయడానికి వెళ్లి షూ దొంగిలించడం సిసి కెమెరాలో బంధించబడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also:Supreme Court: కేజ్రీవాల్‌ బెయిల్ పిటిషన్ స్వీకరణ.. విచారణ ఎప్పుడంటే..!

దీనిపై సోనూసూద్ స్పందిస్తూ.. స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. అది అవసరం కాబట్టే తీసుకుని ఉండవచ్చు. తద్వారా మానవత్వం వర్ధిల్లుతుందని అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన పోస్టుపై వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోనూసూద్‌ వైఖరికి ఒక వర్గం మద్దతు తెలుపగా, మరో వర్గం వ్యతిరేకిస్తోంది. సోనూసూద్ అభిప్రాయం తప్పని నిరసన తెలుపుతున్న వారు దొంగతనాన్ని సమర్థించడం ఎంతవరకు సరైందని ప్రశ్నించారు. భారతదేశంలోని లక్షలాది మంది ప్రజలు స్విగ్గీ డెలివరీ బాయ్ కంటే పేదలున్నారని అన్నారు.

Read Also:Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఏప్రిల్ 15న సుప్రీంకోర్టులో విచారణ

కస్టమర్‌కు సరుకులు డెలివరీ చేసిన తర్వాత డోర్ బయట ఉంచిన షూలను స్విగ్గీ డెలివరీ బాయ్ దొంగిలించిన వీడియో వైరల్ అవుతోంది. గురుగ్రామ్‌లో జరిగిన ఈ చోరీ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ప్రజలు ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కూడా డెలివరీ బాయ్‌కు మద్దతు ఇచ్చాడు. అయితే తాను చేసిన పోస్టుపై ట్రోల్‌లను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ ట్వీట్ తర్వాత చాలా మంది వినియోగదారులు సోనూ సూద్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. “అతడు పేదరికంలో ఉండొచ్చు కానీ దొంగతనం నేరం. చైన్ స్నాచర్ మీ బంగారు గొలుసును దొంగిలించినట్లయితే, అతనిపై చర్య తీసుకోరా అంటూ వినియోగదారులు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version