Site icon NTV Telugu

రేపు ఎంపీలతో సోనియా గాంధీ సమావేశం

Sonia Gandhi

Sonia Gandhi

సోమవారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో… అన్ని పార్టీలు వ్యూహరచనలో మునిగిపోయాయి.. అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని, ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారని.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ.. పాత, కొత్త కేంద్ర మంత్రులకు సూచనలు చేయగా.. మరోవైపు ప్రతిపక్షాలు కూడా సమస్యలను లేవనెత్తేందుకు సిద్ధం అవుతున్నాయి.. అందులో భాగంగా.. రేపు సాయంత్రం 6 గంటలకు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేయనున్నారు.. రఫేల్ వివాదంతో పాటు, సమావేశాలలో చర్చకు రానున్న ప్రాధాన్యతాంశాలపై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు సోనియా గాంధీ.

Exit mobile version