Crime News: నంద్యాల జిల్లా డోన్‌లో దారుణం జరిగింది. తండ్రి బతికుండగానే చనిపోయాడని కుమారుడు లోకేష్ ఆస్తిని అమ్మేశాడు. తండ్రి బ్రతికి ఉన్నాడంటూ తండ్రితో కలసి పెద్ద కుమారుడు రామకృష్ణ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చిన్న కుమారుడు లోకేష్ పరారీలో ఉన్నాడు. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా తన తండ్రి ఆస్తిని ఇతరులకు అధికారులు రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా అధికారులకు పెద్ద కుమారుడు రామకృష్ణ ఫిర్యాదు చేశాడు. లోకేష్ నుండి ప్రాణహాని ఉందని పోలీసులకు తండ్రి లక్ష్మీ నారాయణ, రామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Crime News: తండ్రి బతికుండగానే చనిపోయాడని ఆస్తిని అమ్మేసిన కుమారుడు

Crime