NTV Telugu Site icon

Jaipur: ఆభరణాల్లో వాటా కోసం తల్లి అంత్యక్రయలు ఆపిన కుమారుడు..(వీడియో)

Video

Video

నవమాసాలు మోసి కని ఆలనా పాలనా చూసిన తల్లి తాను చనిపోతే తలకొరివి పెడతాడు అనుకుంటుంది.. కానీ.. ఆస్తి కోసం ఓ కొడుకు మానవత్వాన్ని మరిచి పోయాడు. నవమాసాలు మోసి, కని పెంచి పెద్ద చేసిన తల్లికే తలకొరివి పెట్టడానికి నిరాకరించాడు. తనకు ఆస్తి ఇస్తే తప్ప తలకొరివి పెట్టనని స్మశానంలో అడ్డం తిరిగాడు. ఈ ఘటన తాజాగా జైపూర్‌లోని విరాట్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

READ MORE: Pakistan: భారత్‌ని మరిచిపోండి, పాకిస్తాన్ ఈ రెండు రాష్ట్రాల GDPని కూడా దాటలేదు..

రాజస్థాన్‌ కోట్‌పుట్లి-బెహ్రోర్ జిల్లా లీలా కా బాస్ గ్రామానికి చెందిన భూరి దేవి(80) మే 3న మరణించారని స్థానికులు తెలిపారు. ఆమెకు ఏడుగురు కుమారులు ఉన్నారు. అందులో ఆరుగురు గ్రామంలో కలిసి నివసిస్తున్నారు. ఐదవ కుమారుడు ఓంప్రకాష్ విడివిడిగా నివసిస్తున్నాడు. ఓంప్రకాష్, అతని తోబుట్టువుల మధ్య చాలా సంవత్సరాలుగా ఆస్తి వివాదం సాగుతోంది. తన తల్లి చనిపోయే రోజు వరకు ఆమె బాధ్యతలను పెద్ద కొడుకు చూసుకున్నాడు. అయితే.. ఆమె శరీరంపై ఉన్న వెండి గాజులు, ఇతర బంగారు ఆభరణాలు కుటుంబ పెద్దలు పెద్ద కొడుకుకి అప్పగించారు.

READ MORE: Indus Water Treaty: పాక్‌కి షాక్ ఇవ్వనున్న భారత్.. సింధు నదులపై కాలువలు, ప్రాజెక్టులకు శ్రీకారం..

అయితే.. ఇంట్లో చివరి కర్మలు పూర్తి చేశారు. అంత్యక్రియల ఊరేగింపు శ్మశాన వాటికకు చేరుకుంది. ఓంప్రకాష్ కూడా శవపేటికను తీసుకెళ్లడానికి సహాయం చేశాడు. దహన సంస్కార స్థలానికి చేరుకున్న ఓంప్రకాష్ వెంటనే ఆందోళన చేయడం ప్రారంభించాడు. తన తల్లి చితిని తగుల బెట్టకుండా, అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్నాడు. అకస్మాత్తుగా ఆ చితిపై పడుకున్నాడు. తన తల్లి ఆభరణాలు తనకు ఇవ్వకపోతే దహన సంస్కారాలు చేయనివ్వను అని పట్టుబట్టాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అతనితో మాట్లాడటానికి ప్రయత్నించినప్పటికీ, ఓంప్రకాష్ దాదాపు రెండు గంటల పాటు చితిపై నుంచి దిగడానికి నిరాకరించాడు. ఆభరణాలను దహన సంస్కారాల స్థలానికి తీసుకువచ్చి అతనికి అప్పగించిన తర్వాతే భూరి దేవి అంత్యక్రియలు పూర్తి చేయడానికి అనుమతించాడు. ప్రస్తుతం ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు ఓం ప్రకాష్‌పై మండిపడుతున్నారు.