Site icon NTV Telugu

Theft Case: పెళ్లి సంబంధం కోసం వచ్చి.. సొంత మేనత్త ఇంట్లో చోరీ

Gold Theft

Gold Theft

Theft Case: పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ అల్లుడు సొంత మేనత్త ఇంటికి కన్నం వేశాడు. పెళ్లి సంబంధం కోసం వచ్చి మేనత్త ఇంట్లో బంగారు నగలు చోరీ చేసిన ఘటన పార్వతీపురం మండలంలో గల పెదబొండపల్లిలో జులై 27న జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు రాజమండ్రికి చెందిన దేవబత్తుల లక్ష్మణరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 16 తులాల నగలను పార్వతీపురం రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో వివరాలను ఏఎస్పీ అంకిత సూరణా వెల్లడించారు. గతంలో నిందితుడిపై రాజమండ్రిలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

Read Also: Harsha Sai: న్యూడ్ వీడియోలతో బ్లాక్ మైయిల్.. హర్షసాయిపై రేప్ కేసు నమోదు

Exit mobile version