NTV Telugu Site icon

Wanaparthy: ఆస్తి కోసం తల్లిదండ్రులపై వేధింపులు.. డీజీపీకి ఫిర్యాదు

Vanaparthy

Vanaparthy

ఆస్తి కోసం కన్నబిడ్డలు ఎంతకైనా తెగిస్తున్నారు. తమ పిల్లలను చిన్నప్పటి నుంచి పెంచి పోషించి, ఓ ప్రయోజనకుడిని చేస్తే తగిన పాఠాలే చెబుతున్నారు. తల్లిదండ్రులను గౌరంగా చూసుకోవాల్సిన కొడుకులు, కూతుళ్లు దారుణానికి ఒడిగడుతున్నారు. అవసరమైతే ప్రాణాలు తీసే వరకూ వెళ్తున్నారు. తాజాగా.. అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కన్న కొడుకు నుండి రక్షణ కల్పించండంటూ, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు ఓ సీఐ తల్లిదండ్రులు. నలుగురికి రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉండి కూడా ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను ఓ సీఐ వేధిస్తున్నాడు. కొడుకు నుండి రక్షణ కల్పించాలంటూ బాధిత తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీని కలిసి కొడుకు పై ఫిర్యాదు చేశారు.

Sekhar Basha: శేఖర్ బాషాను రౌడీలతో కొట్టించిన లావణ్య?

వనపర్తి జిల్లా ఖల్లా ఘనపురం మండలం వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సీఐ, చిన్నకొడుకు యాదయ్య కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అయితే రఘునాథ్ రెడ్డికి ఉన్న 30 ఎకరాల 23 గుంటల భూమిని పెద్దకొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు రాసిచ్చారు. మిగిలిన భూమిని కుతుళ్లకు ఇచ్చేందుకు ఉంచుకున్నారు.

Devara Second Single: దేవర సెకండ్ సాంగ్ వచ్చేసింది.. విన్నారా?

అయితే పెద్దకొడుకు సీఐ అయిన నాగేశ్వర్ రెడ్డి తన పేరుపై ఇంకో ఐదేకరాల భూమి రాయించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేశాడు. అది వినకపోయేసరికి పలుమార్లు తల్లిదండ్రులను దూషించడంతో పాటు దాడి చేశాడు. దానికి ఆ వృద్ధ దంపతులు కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు.. పెద్ద కొడుకు వేధింపులు తాళలేక తమ చిన్న కొడుకు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం తమ పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2 లో సీఐగా విధులు నిర్వహిస్తున్నాడని వారు చెప్పారు. తన కొడుకు నాగేశ్వర్ రెడ్డి పై చర్యలు తీసుకొని, తమకు రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు.