Wanaparthy: కన్న కొడుకు నుండి రక్షణ కల్పించండి.. డీజీపీకి ఫిర్యాదు చేసిన సీఐ తల్లిదండ్రులు
- కన్న కొడుకు నుండి రక్షణ కల్పించండి
- రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన ఓ సీఐ తల్లిదండ్రులు
- నలుగురికి రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉండి కూడా..
- ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను వేధిస్తున్న సీఐ
- కొడుకు నుండి రక్షణ కల్పించాలంటూ..
- డీజీపీని కలిసి కొడుకు పై ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్తి కోసం కన్నబిడ్డలు ఎంతకైనా తెగిస్తున్నారు. తమ పిల్లలను చిన్నప్పటి నుంచి పెంచి పోషించి, ఓ ప్రయోజనకుడిని చేస్తే తగిన పాఠాలే చెబుతున్నారు. తల్లిదండ్రులను గౌరంగా చూసుకోవాల్సిన కొడుకులు, కూతుళ్లు దారుణానికి ఒడిగడుతున్నారు. అవసరమైతే ప్రాణాలు తీసే వరకూ వెళ్తున్నారు. తాజాగా.. అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కన్న కొడుకు నుండి రక్షణ కల్పించండంటూ, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు ఓ సీఐ తల్లిదండ్రులు. నలుగురికి రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉండి కూడా ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను ఓ సీఐ వేధిస్తున్నాడు. కొడుకు నుండి రక్షణ కల్పించాలంటూ బాధిత తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీని కలిసి కొడుకు పై ఫిర్యాదు చేశారు.
Sekhar Basha: శేఖర్ బాషాను రౌడీలతో కొట్టించిన లావణ్య?
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
వనపర్తి జిల్లా ఖల్లా ఘనపురం మండలం వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సీఐ, చిన్నకొడుకు యాదయ్య కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అయితే రఘునాథ్ రెడ్డికి ఉన్న 30 ఎకరాల 23 గుంటల భూమిని పెద్దకొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు రాసిచ్చారు. మిగిలిన భూమిని కుతుళ్లకు ఇచ్చేందుకు ఉంచుకున్నారు.
Devara Second Single: దేవర సెకండ్ సాంగ్ వచ్చేసింది.. విన్నారా?
అయితే పెద్దకొడుకు సీఐ అయిన నాగేశ్వర్ రెడ్డి తన పేరుపై ఇంకో ఐదేకరాల భూమి రాయించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేశాడు. అది వినకపోయేసరికి పలుమార్లు తల్లిదండ్రులను దూషించడంతో పాటు దాడి చేశాడు. దానికి ఆ వృద్ధ దంపతులు కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు.. పెద్ద కొడుకు వేధింపులు తాళలేక తమ చిన్న కొడుకు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం తమ పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2 లో సీఐగా విధులు నిర్వహిస్తున్నాడని వారు చెప్పారు. తన కొడుకు నాగేశ్వర్ రెడ్డి పై చర్యలు తీసుకొని, తమకు రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!