Site icon NTV Telugu

Son Attacked Mother: మద్యం తాగేందుకు ఫైసల్ ఇవ్వలేదని తల్లిపై కొడుకు దాడి

Son Attected

Son Attected

మద్యానికి బానిసైన వాళ్లు మందు కోసం ఏం చేసేందుకైన సిద్ధపడతారు. అలాంటిది మందు తాగేందుకు డబ్బులు లేకపోతే సొంత భార్య తాళిబొట్టునే అమ్ముకునే దుర్మార్గులు ఉన్న పరిస్థితి ఈ సమాజంలో నెలకొంది. అలాంటి మద్యానికి అనేక మంది అడిక్ట్ అయ్యారు. అస్సలు మద్యం లేకపోతే.. తమ సర్వస్వము కోల్పోయినట్లు తాగుబోతులు ఫీల్ అవుతారు. అయితే.. మరికొంత మంది కన్న తల్లిపైనే డబ్బుల కోసం దాడులు చేస్తున్న ఘటనలు జరిగాయి.

Read Also: BJP: ఆ స్థానాలు, 5 రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్.. నడ్డా నేతృత్వంలో బీజేపీ కీలక సమావేశం..

తాజాగా తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన కన్న తల్లిని ఓ తాగుబోతు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని పొట్టుపొట్టుకొట్టాడు.
మద్యానికి డబ్బు ఇవ్వలేదని కన్న తల్లినే నడి రోడ్డుపై జుట్టు పట్టి లాగి ఓ యువకుడు పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఇవాళ (బుధవారం) జరిగింది. అయితే.. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన పద్మమ్మ భర్త కోల్పోయి ఓ హోటల్ లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తుంది.

Read Also: Minister Taneti vanitha: కేంద్ర నిఘా వర్గాల సమాచారం నిజమేనా..? పవన్‌ బయటపెట్టాలి..

తన కొడుకు సంతోష్ తాగుడుకు బానిసై తరచూ ఫైసల కోసం తల్లిని వేధిస్తూ ఉండేవాడు. గతంలోనూ పలుసార్లు డబ్బులు ఇవ్వలేదని తల్లిపై దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, గతంలో కూడా ఈ యువకుడు తన తల్లిపై దాడి చేయడంతో స్పందించిన పోలీసులు ఆ తాగుబోతు కొడుకును స్టేషన్ కు తరలించి మందలించి వదిలేశారు. అయినా ఆ తాగుబోతు యువకుడిలో మార్పు రాలేదు.. మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఇవాళ కూడా కన్నతల్లిని కొట్టాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు అప్పగించడంతో పీఎస్ కు ఆ యువకుడిని తరలించారు.

Exit mobile version