NTV Telugu Site icon

Somireddy: ఈ సారి వైసీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉండరు..

Somireddy

Somireddy

TDP Leader: నెల్లూరు జిల్లాలో టీడీపీ పార్టీ ఆఫీసులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సొంత నియోజక వర్గం అయినా సర్వేపల్లిలోనే రైతులకు విద్యుత్ ను సక్రమంగా సరఫరా చేయడం లేదు అని ఆరోపించారు. ఆయన మంత్రిగా అడుగు పెట్టిన తర్వాతే జిల్లాలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగు దేశం పార్టీలోకి వచ్చారు అని ఆయన తెలిపారు. ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే.. గాజువాక ఇన్చార్జి కూడా వైసీపీకి రాజీనామా చేశారు.. ఈ సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉండరు అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.

Read Also: V.H: ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కల్చర్..

ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పది సీట్లలోపే వస్తాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జోస్యం చేప్పారు. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తన స్వగ్రామం సర్వేపల్లి తప్పితే ఇతర ప్రాంతాలకు వెళ్లడం లేదు.. మంత్రి కాక ముందే పలు కుంభకోణాలకు పాల్పడ్డారు.. ఇక, ఇప్పుడు మంత్రిగా ఇక చెప్పనవసరం లేదు.. గ్రావెల్, ఇసుక, సిలికాను అక్రమంగా తరలిస్తున్నారు అని ఆయన ఆరోపణలు చేశారు. మంత్రి సొంత మండలంలోనే అక్రమ మైనింగ్ జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.