NTV Telugu Site icon

Somireddy Chandramohan Reddy: జగన్, విపత్తులు.. కవల పిల్లలు..! ఆయన సీఎం అయ్యాక 9 విపత్తులు..!

Somireddy

Somireddy

Somireddy Chandramohan Reddy: వైఎస్‌ జగన్, విపత్తులు.. కవల పిల్లలు..! ఆయన ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక 9 విపత్తులు వచ్చాయంటూ విమర్శలు గుప్పించారు టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయ.. రాష్ట్రంలో తీవ్రమైన కరవు ఉంది.. రాష్ట్రంలో 470 మండలాల్లో కరవు ఉంటే 103 మండలాలను మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది.. 70 ఏళ్ల తర్వాత అక్టోబర్ లో లోటు వర్షపాతం నమోదైంది.. వరి సాగు గణనీయంగా తగ్గిపోయింది.. ఇతర పంటలు వేయడం లేదు.. వ్యవసాయ, ఇరిగేషన్ మంత్రులు కనీసం సమీక్షలు కూడా నిర్వహించడం లేదు.. కరవు ప్రాంతాలలో పర్యటిస్తుంటే కడుపు తరుక్కుపోతోంది.. రాష్ట్రంలో కరవు లేని జిల్లా లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Minister KTR: నాంపల్లి బాధితులకు ఒక్కొక్కిరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా

కడప జిల్లాలో కరవు మండలాలను ఇంకా ప్రకటించలేదు.. టీడీపీ పాలనలో కరవును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం అన్నారు సోమిరెడ్డి.. రాయలసీమ బిడ్డ అని చెప్పుకొని రాయలసీమను జగన్ ముంచేస్తున్నాడు.. టీడీపీ హయంలో ఇరిగేషన్ కు రూ. 63 వేల కోట్ల నిధులను ఖర్చు చేశామని తెలిపారు.. కానీ వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకూ 23 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. టీడీపీ హయాంలో కరవు సమయంలో పశువులకు పశుగ్రాసంతో శిబిరాలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ మంత్రులు కరవు ప్రాంతాలలో పర్యటించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి హోల్ సెల్, మంత్రులు రిటైల్ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. వరికి 25 వేలు, వాణిజ్య పంటలకు 50 వేలు, వేరుశెనగ, జొన్న లకు 25 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.

Show comments