NTV Telugu Site icon

Somireddy: నెల్లూరులో కేజీఎఫ్-3 లాగా మైనింగ్ మాఫియా

Somireddy

Somireddy

Mining Mafia: నెల్లూరు జిల్లాలో ఐదు వేల కోట్ల రూపాయల విలువైన సిలికాన్.. 3 వేల కోట్ల విలువైన తెల్ల రాయిని దోచేశారంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. దేశంలోనే ఇది ఒక పెద్ద కుంభకోణం.. సెంట్రల్ విజిలెన్స్ తో పాటు అధికారుల అందరికీ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరాం.. మైనింగ్ లేచి దారులకు రెన్యువల్ చేయకుండా వైసీపీ నేతలు వాటిలో అక్రమంగా తెల్ల రాయిని తవ్వుతున్నారు.. న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా ఇంత వరకు అధికారులు స్పందించలేదు అని ఆయన ఆరోపించారు. అక్కడికి వెళ్లి మళ్లీ చూడగా 14 హిటాచీలు, జిలేటిన్ స్టిక్స్, ట్రక్స్ ను పెట్టి మైనింగ్ చేస్తున్నారు.. బ్లాస్టింగ్ చేస్తుండడంతో చుట్టు పక్కల ఉండే గిరిజనులు భయపడుతున్నారు.. పేలుడు పదార్థాలను భద్రత లేకుండా నిల్వ ఉంచారు అంటూ సోమిరెడ్డి విమర్శించారు.

Read Also: PM Modi: పార్లమెంట్‌లోకి చొరబడిన వారికి ప్రతిపక్షాల మద్దతు దురదృష్టకరం : ప్రధాని మోడీ

జిల్లా కలెక్టర్, ఎస్పీ ఏం చేస్తున్నారు అంటూ మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ కే వాటాలు ఇస్తున్నారు.. ఒక్కో మండలాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జీలు పంచుకున్నారు.. లీజు పర్మిట్ లేకుండా ఇంత దోపిడీ చేస్తున్నా.. ఎవరూ స్పందించడం లేదు అని తెలిపారు. కేజీఎఫ్-3 లాగా దోచుకుంటున్నారు.. అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలని నేను నిరసన కార్యక్రమాన్ని చేపడితే దానిని కూడా భగ్నం చేశారు అంటూ ఆయన ఆరోపించారు. నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా నన్ను తరలించారు.. నా నిరసనను భగ్నం చేసేందుకు హిజ్రాలను తీసుకువచ్చారు.. రౌడీలను పంపించి నా కారు అద్దాలను ధ్వంసం చేశారు.. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఇంతటి ఘోరాన్ని చూడలేదు.. బీహార్, ఉత్తరప్రదేశ్ లాగా ఆంధ్రప్రదేశ్ కూడా మారిపోయింది అని సోమిరెడ్డి మండిపడ్డారు.

Read Also: Raghunandan Rao: రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు

ఏం చేయాలో మాకు తెలుసు.. అదే చేస్తామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కార్యాచరణ రూపొందించి పోరాడుతాం.. త్వరలో మా ప్రభుత్వం వస్తుంది.. ఎస్పీ, కలెక్టర్లు జాగ్రత్తగా ఉండాలి.. అందరి మీదా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.. మంత్రి గోవర్ధన్ రెడ్డి నాపైకి హిజ్రాలు, రౌడీలను పంపించారు.. ఆయన అంటే ప్రజలకు ఏమిటో తెలిసింది అని మాజీ మంత్రి అన్నారు. నాకు విదేశాలలో వెయ్యి కోట్ల రూపాయల మేర ఆస్తులు ఉన్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించారు.. అక్రమంగా మైనింగ్ జరుగుతున్నట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అంగీకరించారు.. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి అని చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.