NTV Telugu Site icon

Dark Choclate: డార్క్ చాక్లెట్ వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?

Dark Choclate

Dark Choclate

Dark Choclate: చాలా మంది మహిళలు చాక్లెట్ తింటే బరువు పెరుగుతామని తినడం మానేస్తారు. అది తింటే ఏదో నేరం చేసినట్లు పదేపదే గుర్తు చేసుకుని బాధపడుతుంటారు. మీకు ఇంకా ఎలాంటి సందేహాలొద్దు. ఏం చక్కా చాక్లెట్లను తినేయండి. చాక్లెట్లు తింటే ఆరోగ్యానికి ప్రయోజనకరమని ఇటీవల ఓ సర్వేలో కూడా రుజువైంది. ఈ అధ్యయనంలో అమెరికాలో దాదాపు 45శాతం మంది మహిళలు చాక్లెట్ తినాలనే కోరికలను కలిగి ఉన్నారు.

91శాతం కాలేజీ అమ్మాయిలు చాక్లెట్లు తినాలని ఉంటుంది కానీ బరువు పెరుగుతుందన్న భయంతోనే వాటికి దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా మహిళల విషయానికొస్తే రుతుక్రమంలో వచ్చే హార్మోన్ల అసమతుల్యత… చాక్లెట్లు తినాలనే కోరికను వారిలో పెంచుతుంది. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, సెరోటోనిన్ స్థాయిలు తగ్గడం, కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) పెరగడం వల్ల చక్కెర వారికి చాక్లెట్‌ల వంటి మరిన్ని స్వీట్లను కోరుకునేలా చేస్తుంది.

Read Also: Byreddy Rajasekhar Reddy: అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమకు ఉరితాడు

కానీ పురుషుల మాదిరిగా కాకుండా, చాలా మంది మహిళలు చాక్లెట్లు చూడగానే.. వాటిని తినాలా వద్దా అనే డైలమాతో పోరాడుతున్నారని పరిశోధనలు సూచిస్తున్నాయి. చాక్లెట్‌తో వారికున్న ఈ ఒత్తిడి కొన్నిసార్లు హానికరం కావచ్చు. చాక్లెట్లు నాలుక రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎలా ఉపయోగపడతాయో పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.

చాక్లెట్ తినే అలవాటును చంపుకోకూడదు.. కాకపోతే సాధారణ చాక్లెట్లు కాకుండా డార్క్ చాక్లెట్లు తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. చాక్లెట్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. డార్క్ చాక్లెట్ ఆరోగ్యంపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. డార్క్ చాక్లెట్‌లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులోని ఫ్లేవనాల్స్ ఇన్‌ఫ్లమేషన్‌తో పోరాడి ఫ్రీ రాడికల్స్ వల్ల సెల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.

Read Also: KTR fire on Revanth Reddy: రేవంత్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.. శ్రీధర్, భట్టన్నలు మంచోల్లు

డార్క్ చాక్లెట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటు, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. డార్క్ చాక్లెట్ గుండెకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. స్ట్రోక్, కరోనరీ హార్ట్ డిసీజ్, గుండె జబ్బుల నుండి మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాల్స్ రోగనిరోధక వ్యవస్థను సమతుల్యం చేస్తాయి.. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించడంలో సహాయపడే ప్రక్రియలకు మద్దతు ఇస్తుంది. ఇది మధుమేహాన్ని నిరోధిస్తుంది.

డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాల్స్ మెదడు పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతాయి. వీటిలో మెరుగైన ప్రతిచర్య సమయం, దృశ్య-ప్రాదేశిక అవగాహన.. బలమైన జ్ఞాపకశక్తి ఉన్నాయి. డార్క్ చాక్లెట్‌లోని ఎపికాటెచిన్ రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. ఎక్కువగా ఎక్సర్ సైజ్ చేసే సమయంలో అథ్లెట్లు ఉపయోగించే డార్క్ చాక్లెట్లు వారిలో ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గిస్తాయి. ఇది అథ్లెట్ వ్యాయామ తీవ్రతను ఎక్కువసేపు నిర్వహించడానికి సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ తినే వ్యక్తులు తక్కువ ఒత్తిడికి గురవుతారని.. ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని పరిశోధకులు ధృవీకరించారు.

Show comments