NTV Telugu Site icon

Soma Bharath : కారు పోలిన గుర్తు ఉంటే.. వేల ఓట్లు అటు పోతున్నాయి

Soma Bharath

Soma Bharath

మనుగోడు ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు ఆయా పార్టీల నేతలు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మునుగోడు ఉప ఎన్నిక వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని గెలిపించాలంటూ ఆ పార్టీ నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులకు కౌంటర్‌లు ఇస్తున్నారు. అయితే.. తాజాగా.. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ మాట్లాడుతూ. మునుగోడులో బండి సంజయ్ స్పీచ్ పచ్చి భూతులు…. అబద్ధాలు అని వ్యాఖ్యానించారు. భయబ్రాంతులకు గురిచేసేలా బండి సంజయ్ మాట్లాడారని, టీఆర్ఎస్ 40 వేలు ఇస్తుందని …అయిన బీజేపీకి ఓటు వేయాలని బండి కోరారన్నారు.

ఎన్నికల నిబంధనల కింద కోడ్ ను బండి సంజయ్ ఉల్లంఘించారని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ పై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరామని, బండి సంజయ్ పై చర్యలు తీసుకోకపోతే ఈసీపై విశ్వాసం పోతుందని చెప్పామన్నారు. చర్యలు తీసుకోకపోతే బీజేపీకి ఈసీ వత్తాసు పలికిందని భావించాల్సి ఉంటుందని, కారు పోలిన గుర్తు ఉంటే… వేల ఓట్లు అటు పోతున్నాయన్నారు. రాజకీయ పార్టీలకు ఇప్పటికే కేటాయించిన గుర్తులను పోలిన గుర్తులను పోలి ఉంటే సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.